సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో వార్తలు కనపడతాయి. నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది మనకి తెలీదు. ఈ మధ్యన నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతున్నారు. అందుకే అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. పైగా నకిలీ వార్తలని చూసి అంతా మోసపోతుంటారు. అలానే వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. కనుక జాగ్రత్తగా ఉండాలి.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద టెన్త్ క్లాస్ విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఉండవని ఒక వార్త వాట్సాప్ లో మారుమొగి పోతోంది. మరి అది నిజమేనా..? టెన్త్ విద్యార్థులకి బోర్డు పరీక్షలు ఉండవా..? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఈ మార్పు చేశారా..?
ఇందులో నిజం ఎంత అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే అని తెలుస్తోంది. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. అందులో ఎలాంటి మార్పులు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేయలేదు. వాట్సాప్ లో షికార్లు కొడుతున్న ఈ వార్తని కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేయలేదు. కాబట్టి అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తల్ని నమ్మి మోసపోవద్దు ఇటువంటి వార్తలని ఇతరులకు కూడా షేర్ చేయకండి.