దోమలు ఎక్కువగా ఉంటే నిజంగా ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది దోమల బారి నుంచి బయటపడడానికి స్ప్రే వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కెమికల్స్ కంటే కూడా ఈ పద్ధతిని ఉపయోగించడం మంచిది. దోమలు కుట్టడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకని ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే మరి ఇంట్లో దోమలు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఇప్పుడే చూసేద్దాం.
తులసి:
తులసి లో మెడిసినల్ గుణాలు ఉంటాయి. తులసిని ఉపయోగించడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. తులసి రసాన్ని బాడీ కి రాసుకోవడం వల్ల దోమలు కుట్టవు. కాబట్టి తులసి ని ఉపయోగించవచ్చు.
లెమన్ గ్రాస్:
చాలా మంది ఇళ్లల్లో లెమన్ గ్రాస్ ను ఉపయోగిస్తారు. ఎందుకంటే మంచి సువాసన వస్తుంది కనుక. లెమన్ గ్రాస్ మూడ్ ని మారుస్తుంది అలానే దోమలు లేకుండా చేస్తుంది.
కర్పూరం:
కర్పూరం కూడా దోమలు కుట్టకుండా చేస్తుంది. మీరు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించారు అంటే దోమలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతాయి.
Are there many mosquitoes in your house? But follow these tips ..!
లావెండర్ ఆయిల్ కూడా దోమలు లేకుండా చూస్తుంది. లావెండర్ మంచి సువాసన ఇస్తుంది. ఇది కూడా దోమలు పోగొట్టడానికి హెల్ప్ అవుతుంది.
శుభ్రంగా ఉంచడం:
వేసవికాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి శుభ్రంగా ఇల్లు బాగా ఉంటే దోమలు రావు కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యం. ఈ విధంగా మీరు ఫాలో అయ్యారంటే దోమలు ఉండవు.