అందరిలో వంటగదిలో ఉండే మసాల దినుసుల్లో.. లవంగాలు కచ్చితంగా ఉంటాయి. లవంగాలు అంటే.. నాన్ వెజ్ వంటల్లో స్మెల్ కోసం మాత్రమే వాడే ఐటమ్ కాదు.. ఇందులో అనేక ఔషధగుణాలు దాగి ఉన్నాయి. మీకు తెలుసా… ప్రతిరోజు లవంగాల నీళ్లు తాగితే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.. ఈరోజు మనం లవంగాల వాటర్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం..
ఈ రోజుల్లో ఇమ్యూనిటీ పవర్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు.. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే లవంగాల నీరు తాగడం మంచిది. వేసవిలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. వీటిని నివారించేందకు ప్రతిరోజూ లవంగం నీటిని తాగితే.. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
కొందరికి మొహం, చర్మంపై మచ్చలు ఉంటాయి. అలాంటి వారు.. లవంగం నీటితో వాటిని తొలగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మచ్చలను తొలగించడంలో అద్భుతంగా పనికొస్తాయి. వీటి నీటిని రోజూ తాగడం వల్ల చర్మం లోపలి నుంచి సమస్యలు దూరమై కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
శరీరంలో మంట, వాపు లాంటి సమస్యలు వచ్చినప్పుడు.. లవంగం నీటితో తగ్గించుకోవచ్చు. లవంగం నీరు తాగడం వల్ల కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
దంతాల సమస్యలను దూరం చేయడానికి పూర్వకాలంలో లవంగాలను వాడేవారు. ఇప్పుడు అవే లవంగాలను కలిపి పేస్టులు వస్తున్నాయి. దంతాల నుంచి రక్తస్రావం లేదా నోటిలో నుంచి దుర్వాసన వస్తున్నట్లయితే లవంగం నీటితో పుక్కిలించవచ్చు.. దీంతో నోటిలోని క్రిములు నశించడంతోపాటు దంతాల సమస్యలు కూడా దూరమవుతాయట.
షుగర్ లెవెల్: మధుమేహం ఉన్నవారు లేదా అలాంటి లక్షణాలు కనిపించే వారు లవంగం నీటిని తాగడం చాలా మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లవంగం చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది. కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉండాలంటే.. డైలీ లవంగం వాటర్ తాగటం బెటర్.
ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి.. అందరూ లవంగం నీటిని తాగొచ్చు. బాడీలో కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు.