పనసతో పుట్టెడు ఆరోగ్య ప్రయోజనాలు..

-

పనస పైకి చూడటానికి గరుకుగా ఉన్నా లోపల ఉండే గింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మానవ శరీరానికి కావలసిన అన్నీ కూడా పనస నుంచి లభిస్తాయని అంటున్నారు.ఎన్నో రోగాలు కూడా నయం అవుతాయని నిపుణులు అంటున్నారు..పనస పండు విషయంలో దాదాపు అందరూ చేసే పొరపాటు.. లోపల ఉండే గింజలను పడేస్తుంటారు. కానీ, తిని విసిరేసే పనస గింజలతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆహారంలో ఐరెన్ తగ్గడం వల్ల చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారికి పనస గింజలు గ్రేట్‌గా సహాయపడతాయి. ఎందుకంటే.. ఐరన్ పుష్కలంగా ఉంటే పనస గింజలు తీసుకోవడం వల్ల రక్త వృద్ధి జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రబలుతున్న రోగాల నుంచి బయట పడలాంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం. అయితే పనస గింజలు తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది..

జీర్ణ సమస్యలు ఉన్న వారికి పనస గింజలు బెస్ట్ ఆప్షన్‌. అంతేకాదు.. పనస గింజలను పొడి చేసుకుని తీసుకుంటే జీర్ణ సమస్యలు ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలలో ఒకటన్న సంగతి తెలిసిందే. అయితే విటమిన్ ఎ పనస గింజల్లో పుష్కలంగా లభ్యమవుతుంది. కాబట్టి, పనస గింజలను ఉడకబెట్టి లేదా వేరే విధంగా కూడా తీసుకోవచ్చు.. కళ్ళకు, గుండెకు, ఎముకలకు, దంతాలకు, జుట్టుకు కూడా ఈ గింజలు చాలా మంచివి..

 

Read more RELATED
Recommended to you

Latest news