ఈ రోజు కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చాలా కొత్త విధానాలను ఈ రోజు నుండి అమలులోకి వచ్చింది. అందులో భాగంగా ఒక కొత్త విధానం గురించి చూద్దాం. ఎప్పటి నుండో ఇన్కమ్ టాక్స్ ఆధార్ మరియు పాన్ రెండింటినీ అనుసంధానం చేయమని చెబుతూనే ఉంది. అయినా కొందరు చేయడంలా లేదు.. అందుకే రీ రెండింటినీ అన్నిటికీ కంపల్సరీ చేసుకుంటూ వస్తోంది.
ఇప్పుడు PPF , SSY, SCSS మరియు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ లాంటి చిన్న మొత్తాలను పొదుపు చేసుకునే స్కీం లను కొనసాగించాలంటే ఖచ్చితంగా ఆ అకౌంట్ లకు మీ ఆధార్ మరియు పాన్ ను లింక్ చేయాల్సిందే. ఒకవేళ ఇవి లింక్ కాకుంటే ఆ ఖాతాలు ఇన్ ఆక్టివ్ అయిపోతాయి. కాబట్టి దేని గురించి పూర్తి విషయాలు తెలుసుకుని త్వరగా ఈ లింక్ ను చేసుకోండి.