ఏపీలో ఈ రోజు నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3 వ తేదీ నుండి ఏప్రిల్ 18 వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకారం అన్ని పరీక్షలు జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం అయ్యి… మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తుంది. ఇప్పటికే పరీక్షలు జరగనున్న అన్ని కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ పరీక్షలు 6, 64,152 మంది విద్యార్థులు రాస్తున్నారు. అందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను సిద్దం చేశారు. అయితే అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం పరీక్ష రాయనున్న విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయానికి కన్నా ముందే చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒకవేళ పరీక్ష సమయానికి ఒక్క నిముషం ఆలస్యం జరిగినా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అందుకే సంవత్సర కాలం పాటు కష్టపడిన చదువు అర్దం లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. కాగా కొన్ని కేంద్రాలలో పరీక్ష జరిగే పరిసరాలలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు.