క్రిస్మస్ స్పెషల్: కోజియార్ క్రిస్మస్ విలేజ్ ని చూసొద్దాం రండి…!

-

క్రిస్మస్ వచ్చిందంటే చాలు అక్కడ పండుగ వాతావారణం నెలకొంటుంది. అక్కడి ప్రజలంతా క్రిస్మస్ ను ఘనంగా జరుపుకుంటారు. ఊరినంతా లైట్లతో డెకరేట్ చేస్తారు. అయితే.. ఆ ఊరికి ఓ స్పెషాలిటీ ఉందండోయ్. ప్రతి సంవత్సరం క్రిస్మస్ కు ఏదో ఒక స్పెషల్ చేసి ప్రపంచాన్నే ఆకర్షిస్తారు. ఈ సారి మాత్రం 10 లక్షల లైట్లతో ఆ గ్రామాన్నే అలంకరించేశారు.

వావ్.. సూపర్బ్ కదా. 10 లక్షల లైట్లంటే మామూలు మాటలు కాదు కదా. ఇంతకీ ఎక్కడ అంటారా? పెన్సిల్వేనియాలోని బెర్న్ విల్లేలో ఉన్న కోజియార్ గ్రామం. అది కోజియార్ ఫ్యామిలీకి చెందిన ఊరు. 1948 నుంచి ప్రతి సంవత్సరం కోజియార్ కుటుంబ సభ్యులు వాళ్ల గ్రామాన్ని ఇదిగో ఇలా డెకరేట్ చేస్తుండేవారు. రకరకాల లైట్లతో… ఆధ్యంతం అబ్బురపడేలా లైటింగ్ ను సెట్ చేస్తుండటంతో అది టూరిస్టుల దృష్టిలో పడింది. దీంతో అది టూరిస్ట్ డెస్టినేషన్ గా మారింది.

అందుకే… పెన్సిల్వేనియా వెళ్లాలనుకునేవాళ్లు డిసెంబర్, జనవరి టైమ్ లో వెళ్తే అక్కడి రంగురంగుల లైటింగ్ ను చూసి మైమరిచిపోవచ్చు. ఈసారి ఏకంగా పది లక్షల లైట్లతో కోజియార్ క్రిస్మస్ విలేజీని డెకరేట్ చేశారు. మరి.. ఈసారి ఆ క్రిస్మస్ విలేజ్ ఎలా ఉందో చూద్దామా?

Read more RELATED
Recommended to you

Latest news