అక్కడ డ్యాన్స్ చేయలేని మగవారికి బంఫర్ ఆఫర్..అమ్మాయితో ఒక నైట్..

కొన్ని దేశాల్లో కొన్ని వింత ఆచారాలు ఉంటాయి.. అవి వినడానికి కొత్తగా ఉన్నా కూడా థ్రిల్లింగ్గా ఉంటాయి.ముఖ్యంగా గిరిజన తెగల వాళ్ళ పద్దతులు చాలా భిన్నంగా ఉంటాయి.. పుట్టుక నుంచి చావు వరకూ అన్నీ కొత్తగా ఉంటాయి.ముఖ్యంగా శృంగారానికి సంబంధించి వీరు ఏర్పాటు చేసుకున్న పద్ధతులు ఎంతో చిత్రంగా అనిపిస్తాయి. మీలో ఉత్కంఠతను కూడా రేకెత్తిస్తాయి. కొన్ని వందలు, వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న ఇటువంటి ఆచారాల్లో వాయు తెగ నృత్య సాంప్రదాయం ఒకటి.

వాయు తెగ ప్రజలను సూర్యుడు, ఇసుక మరియు గాలి యొక్క ప్రజలుగా పిలుస్తారు. కొలంబియాకు ఉత్తరాన ఉన్న గువాజిరాలో ఈ తెగ ప్రజలను మీరు చూడవచ్చు. వెనిజులా యొక్క వాయువ్యంలో కూడా వీరు కనిపిస్తారు. కరేబియన్ తీరంలో వెనిజులా-కొలంబియన్ సరిహద్దులో వాయు తెగలు నివసిస్తున్నాయి. వింత ఆచార వ్యవహారాలు కలిగిన ఈ ప్రజల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం…

కొలంబియా, వెనిజులా ప్రాంతాలలో ఎడారిలో సుమారు 10,800 చదరపు కిలోమీటర్లలో వాయు తెగ ప్రజలు విస్తరించి ఉన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో సుమారు 5 లక్షలకు పైగా వాయు తెగ ప్రజలు నివసిస్తున్నట్లు అంచనా. వీరంతా చిన్న వివిక్త సమాజాల్లో నివసిస్తున్నారు. మేకలు, ఆవులు మరియు పంటల మిశ్రమాన్ని నివారించడానికి వీరు చిన్న చిన్న సమాజాలుగా నివసిస్తుంటారు. ఒక్కో స్థావరంలో ఐదు నుండి ఆరు ఇళ్లు ఉంటాయి. ఈ స్థావరాలకు మొక్కలు, జంతువులు లేదా ప్రదేశాల పేర్లను పెడతారు..

ఇక్కడ ఇంటి నిర్మాణం కూడా విచిత్రంగా ఉంటాయి. అంతేకాదు..సంచులు తయారు చేస్తారు. ఇంకా కొన్ని రకాల చేతి వ్రుత్తులకు ప్రసిద్ధి..వారి సంస్కృతి అనేక ఇతిహాసాలు, కథలు, పురాణాలు, సంప్రదాయాలు, ఆచారాలతో మిళితమై ఉంటుంది. ఈ తెగలో స్త్రీలు ఇంటిని నడుపుతూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తే పురుషులు జంతువులు, భూమిని ఉపయోగించి పనులు చేస్తారు.హస్తకళలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి మహిళలు చిన్న వయసు నుంచే నేత నేయడం, అల్లికలు వంటివి నేర్చుకుంటారు. ఆ తరువాతే అదే వారి జీవనోపాధిగా మారుతుంది. సాంప్రదాయ నేత వృత్తిలో వారు సిద్ధహస్తులు. బెల్ట్ లు, షూస్, బ్రాస్ లెట్స్, బ్యాగ్ లు వంటి ఎన్నో వస్తువులను వీరు తయారు చేస్తారు.
రకరకాల వస్తువులను తయారు చేస్తారు.

అవి కొలంబియా కు ఎగుమతి చేస్తారు.అలా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అతిధులకు వినోదం అందించడానికి లా యొన్న అనే సంప్రదాయ నృత్యాన్ని వాయు ప్రజలు అనుసరిస్తారు. ఈ నృత్యం యొక్క పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మాయిలో చిన్న వయసు నుండి నాట్యం నేర్చుకుంటారు. నాట్యం చేసే సమయంలో వారి వేషధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా వదులుగా ఉండే ఎర్రని రంగు దుస్తులను తల నుండి కాళ్ల వరకూ అమ్మాయిలు ధరిస్తారు. వారు ఓ వైపు తమ చేతులను చాపుతూ, మరో వైపు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకు కదులుతారు.

ఆ డ్యాన్స్ పక్షుల కదలికలను గుర్తుకు తెస్తాయి. ఈ విధంగా నృత్యం చేస్తున్న అమ్మాయికి ఎదురుగా ఒక అబ్బాయి కూడా నృత్యం చేస్తుంటాడు. అమ్మాయి ముందుకు నడిస్తే అబ్బాయి ఆమెను చూస్తూ వెనక్కు నడుస్తాడు. చివరికి వారిద్దరూ దగ్గరయ్యే సమయానికి అబ్బాయి కింద పడాలి.అప్పుడు ఆ అమ్మాయితో ఒక రాత్రి శృంగారం చేసే ఛాన్స్ దక్కుతుంది.. అలా అక్కడ మగవారు ఆడవాళ్ళ తో గడుపుతారు..అదొక ఆచారం.. ఏంటో…