వైరల్ వీడియో’ ఈ వీడియో చూస్తే లేచి నిలబడతారు…!

-

ఆనంద్ మహీంద్రా సోమవారం ఒక వికలాంగుడి అద్భుతమైన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. వీడియోలో ఒక వ్యక్తి తనకు రెండు కాళ్ళు లేకపోయినా సరే దేశ భక్తిని చూపిన విధానం విశేషంగా ఆకట్టుకుంది. జాతీయ జెండా మాదిరి ఉన్న త్రివర్ణ టీ-షర్టును ధరిస్తాడు. “నిన్న ఈ పోస్ట్ చేసి ఉండాల్సింది. కాని ఈ ఉదయం నా వద్దకు ఈ వీడియో వచ్చింది. అయితే మనకు స్ఫూర్తినిచ్చే వాటిని చూడటానికి ఆలస్యం ఏమీ లేదు.

మన గురించి మన౦ క్షమాపణ చెప్పుకోవడం మానేస్తాం. గొప్ప పనులు చేయడానికి మనకు కొన్ని కొన్ని గుర్తు చేస్తూ ఉంటారు” అని పోస్ట్ చేసారు ఆనంద్ మహింద్రా. వీడియోలో ఏ విధంగా ఉంది అనేది చూస్తే, ఒక వ్యక్తికి రెండు కాళ్ళు ఉండవు. అయితే జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ఇనుప గొట్టాన్ని ఆ వ్యక్తి పట్టుకుని పైకి ఎక్కుతాడు. కేవలం చేతుల సాయంతో ఎక్కడం మనకు కనపడుతుంది.

అంతే కాకుండా తన రెండు చేతులతో ఇనుప గొట్టాన్ని పట్టుకుని అడ్డంగా ఉండి విన్యాసం చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. “ఇన్క్రెడిబుల్” అని ట్విట్టర్ యూజర్ ఒకరు పేర్కొనగా “ఎటువంటి అడ్డంకులు అతని మార్గాన్ని ఆపలేవు” అని మరొకరు పేర్కొన్నారు. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి.

Read more RELATED
Recommended to you

Latest news