ప్రాణాలు తీస్తున్న కికి చాలెంజ్.. జోలికి పోవద్దని హెచ్చరిస్తున్న పోలీసులు..!

-

ఐస్ బకెట్ చాలెంజ్.. రైస్ బకెట్ చాలెంజ్.. ఫిట్‌నెస్ చాలెంజ్.. గ్రీన్ చాలెంజ్.. ఇలా సోషల్ మీడియాలో రక రకాల చాలెంజ్‌ల ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కికి చాలెంజ్ పేరిట ఓ చాలెంజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది. సెలబ్రిటీలు, సాధారణ యువత కికి చాలెంజ్ స్వీకరిస్తూ తమ తమ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇతర చాలెంజ్‌ల మాట ఏమోగానీ కికి చాలెంజ్ మాత్రం జనాల ప్రాణాలను తీస్తోంది.

కికి చాలెంజ్ అంటే.. కదులుతున్న వాహనంలోకి బయటకు వచ్చి డ్యాన్స్ చేసి మళ్లీ వాహనంలో ఎక్కాలి. ఆ క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ముంబైలో ఓ యువకుడు ఇలాగే కికి చాలెంజ్ చేసి ప్రాణాలను కోల్పోగా, దాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు కికి చాలెంజ్ చేయవద్దని, అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దని అక్కడి జనాలను హెచ్చరిస్తున్నారు. ఇక జైపూర్ పోలీసులు కూడా తమ పౌరులను కికి చాలెంజ్ పట్ల హెచ్చరించారు.

Don't challenge death. Be wise – keep away from silly stunts & advise your friends as well to stay safe.#InOurFeelings #KikiKills #SafetyFirst #SafeJaipur #JaipurPolice

Posted by Jaipur Police on Monday, July 30, 2018

ఇటీవలే నటి అదాశర్మ కికి చాలెంజ్‌ను స్వీకరించి నాగిన్ డ్రెస్‌లో, హాట్ హాట్ డ్యాన్స్ మూవ్‌లతో ఓ వీడియోను షూట్ చేసి దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఇక క్షణాల్లోనే కికి చాలెంజ్ కాస్తా వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చాలెంజ్‌నే సోషల్ మీడియా యూజర్లు స్వీకరిస్తున్నారు. అయితే ఈ చాలెంజ్ మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రం వారు గమనించడం లేదు. ఏం చేస్తాం.. సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అయితే దాన్ని ఫాలో అయిపోవడమే నెటిజన్లకు తెలుసు. కానీ అందులో ఉండే ప్రమాదాలను వారు గుర్తించరు. మీరు మాత్రం ఈ చాలెంజ్‌తో ప్రమాదాలను కొని తెచ్చుకోకండి. తస్మాత్ జాగ్రత్త..!

Read more RELATED
Recommended to you

Latest news