కారు మీది నుంచి పోయినా బతికాడు.. వీడియో

-

అది ముంబైలోని ఘాట్‌కోపర్‌లో ఉన్న కామ్రాజ్ నగర్ ప్రాంతం. సోమవారం రాత్రి.. పిల్లలంతా రోడ్డు మీద ఆడుకుంటున్నారు. ఓ పిల్లాడు కూడా ఆటలో పడ్డాడు. పక్కనే ఆగి ఉన్న ఓ కారు ముందు కూర్చొని షూ లేస్ కట్టుకుంటున్నాడు. అదే సమయంలో పక్కన ఉన్న కారులో ఉన్న యువతి కారును స్టార్ట్ చేసి అలాగే ఆ పిల్లాడి మీది నుంచి పోనిచ్చింది. అయ్యో.. అయ్యో.. ఆమెకు అదేం పోయేకాలం అని అనకండి. ఎందుకంటే.. ఆ పిల్లాడు వచ్చి అక్కడ కూర్చున్న విషయాన్ని ఆ యువతి గమనించలేదు. కారు ఆ పిల్లాడి మీది నుంచి పోయింది. ఏం జరిగిందా పిల్లాడికి అని టెన్షన్ పడకండి. ఆ పిల్లాడికి ఏం కాలేదు. చిన్న దెబ్బ కూడా తాకలేదు. కారు మధ్యలో పడుకోవడంతో ఆ పిల్లాడికి ఏం కాలేదు. వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్లి మళ్లీ తన ఆటలో పడిపోయాడు. ఈ ఘటనను ఎవ్వరూ గమనించలేదు. కానీ.. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

Read more RELATED
Recommended to you

Latest news