కచ్చా బాదం పాటకి డాన్స్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్…!

-

కచ్చా బాదం పాట ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలుసు. సోషల్ మీడియాలో కచ్చా బాదం పాట అందర్నీ ఆకట్టుకుంది. ఈ బెంగాలీ పాటను పల్లీలు అమ్ముకునే వ్యక్తి పాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఒక చిన్నారి ఈ కచ్చా బాదం పాట కి డాన్స్ వేసింది. సోషల్ మీడియా లో ఈ డాన్స్ వీడియో వైరల్ గా మారింది.

 

మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ వీడియోని ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ షేర్ చేశారు. ఆ వీడియోలో మనం ఒక చిన్నారి స్కూల్ యూనిఫామ్ ధరించి ఉండడాన్ని చూడొచ్చు. అంగన్వాడీ కేంద్రం లో ఆమె అందరి ముందు ఈ కచ్చా బాదం పాటకి డాన్స్ చేసింది.

ఈ వీడియో గుజరాత్ లోనిది అని తెలుస్తోంది. కానీ ఆమె ఎవరు అనే వివరాలు తెలియవు. ఈమె నవ్వుతూ ఎంతో అద్భుతంగా ఈ పాటకి డాన్స్ చేసింది. పైగా ఈమె ఎక్స్ప్రెషన్స్ ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే మరి సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న ఈ డాన్స్ వీడియోని మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news