మన దగ్గర కొండవీటి రాజులు, కర్పూర వసంతరాయలు ఈ పండుగను విశేషంగా జరుపుకొనేవారిని పలు గ్రంథాల్లో ఉన్నది.
మనకు రకరకాల పండుగలు ఉన్నాయి. ప్రతి పండుగనాడు ఎవరో ఒక దేవత/దేవుడిని పూజిస్తారు. కానీ ఒక్క పండుగకు మాత్రం ఏ దేవుడిని ప్రత్యేకంగా పూజించని పండుగ. ఏ పండుగా అంటే అదే హోళీ పండుగ. ఈ పండుగ రోజు ప్రత్యేకించి ఏ దేవతను ఆరాధించరు. ముందురోజు కామదహనం అంటే మనలోని కామాలను (కోరికలను) దహనం చేసే కార్యక్రం చేస్తారు. అనవసర కోరికలు ఉండకుండా కేవలం ధర్మబద్ధమైన కోరికలను మాత్రమే ఉండాలనేది దీని అర్థం. తెల్లవారి అందరూ కలిసి ఆనందంగా ఉత్సాహంగా రంగులు, రంగునీళ్లు చల్లుకొని సమూహికంగా నిర్వహించుకునే పండుగ ఇది.
భారత చరిత్రలో హోళీ విశేషాలు!
భారతదేశం అంటేనే సనాతన ధర్మానికి, అనేక ప్రత్యేకతలకు ప్రతీక. ఎన్నో శతాబ్దాలకు పూర్వమే అనేక అద్భుతాలను ఆవిష్కరించిన దేశం మనది. అపురూప శిల్పాలు, కళలు, నఋత్యాలు, నీటిపై తేలాడే దేవాలయాల నిర్మాణాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో విశేషాలు. ఇక పండుగలు అంతే.. ప్రకృతితో మమైకం అయ్యేవి, దేవతారాధనలు విశేషాలు ఎన్నో. వీటన్నింటిలో విభిన్నమైన హోళీ ఏ దేవతకు సంబంధం లేనిది. దీని విశేషాలను పూర్వ నుంచి పరిశీలిస్తే…
-శాతవాహనుల కాలం నాటి గాథాసప్తశతిలో
– కాలిదాసు రాసిన మాలకావిగ్నిమిత్రలో
– హర్షుడి నాగావళిలో
– వాత్సాయునుడు రాసిన కామసూత్రలో
– భీమేశ్వర పురాణంలో
హోళీ పండుగ గురించిన విశేషాలు ఉన్నాయి.
మన దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు
– ఆలెబెరూనీ, నికోలేకాంటే రాసిన పుస్తకాల్లో కూడా రంగులు చల్లుకునే సంప్రదాయం ఉన్నదని, ఆ పండుగ విశేషాలను వారు రాశారు.
మన దగ్గర కొండవీటి రాజులు, కర్పూర వసంతరాయలు ఈ పండుగను విశేషంగా జరుపుకొనేవారిని పలు గ్రంథాల్లో ఉన్నది.
ఈ పండుగ నాడు పూర్వం కస్తూరీ జలాలు, చందనం, కుంకుమ పువ్వుతో తయారుచేసిన రంగులు, బుక్కా, గులాల్, మోదుగ పువ్వుతో చేసిన రంగులను ఎక్కువగా వినియోగించేవారని చరిత్ర గ్రంథాల్లో ఉన్నది.
ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా సహజ సిద్ధమైన రంగులతో ఆనందంగా… ఉత్సాహంగా ఉల్లాసంగా అన్ని పాతవిషయాలను పక్కనబెట్టి ప్రేమతో ఈ పండుగను నిర్వహించుకోండి. బంధు, మిత్రులను అందరినీ కలుపుకొని ముందుకు సాగిపోండి. రాబోయే వసంతానికి ఆనందంతో, సమదఋష్టితో ఆహ్వానం పలకండి.