మొబైల్ లో చూసుకుంటూ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. వీడియో

398

17వ లోక్ సభ సమావేశాలు నిన్ననే ప్రారంభం అయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నిన్న కొందరు ప్రమాణ స్వీకారం చేయగా.. ఇవాళ మిగితా వారు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణం చేశారు. తెలంగాణ ఎంపీలంతా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. మల్కజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం కాస్త వెరైటీగా ప్రమాణ స్వీకారం చేశారు.

నిజానికి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పేపర్ ను పార్లమెంట్ లోని సెక్రటరీ ఎంపీలకు అందిస్తారు. కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం ఆ పేపర్ ను తీసుకోకుండా.. తన మొబైల్ ను ఓపెన్ చేసి మొబైల్ లో చూసుకుంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక.. రేవంత్ ప్రమాణ స్వీకారం చేయడానికి తన సీటులో నుంచి లేచి వస్తుండగా… ఇతర కాంగ్రెస్ ఎంపీలు బల్లలు చరిచారు.

(Video Courtesy: ABN TELUGU)