ఓరి బుడ్డోడా.. సీఎం అవుతావా..?

-

ఇదంతా టెక్నాలజీ యుగం కదా బాస్. ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్. ఎంతలా అంటే.. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టేంత. టెక్నాలజీ వాళ్లను అలా మార్చేస్తుంది బాస్ ఏం చేస్తం. ఇక అసలు విషయానికి వస్తే.. ఓ బుడ్డోడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాడు. దేనికంటారా? మనోడు సీఎం అవుతాడట. అవును.. వయసు 10 ఏళ్లు కూడా ఉండవు కానీ.. నేను ముఖ్యమంత్రిని అయితే.. ఇదిగో ఇవన్నీ చేస్తా అని పేద్ద లిస్టే చెప్పేశాడు. మనోడు కూడా పిల్లాడు కాబట్టి… మనోడు ముఖ్యమంత్రి అయ్యాక పిల్లలకు ఏంఏం చేస్తాడో అవన్నీ పూసగుచ్చినట్టు వివరించాడు. వామ్మో బుడ్డోడా.. నువ్వు చిన్నోడివి కాదురోయ్. నిజంగానే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేట్టున్నవు.. నీ మాటలు చూస్తుంటే అట్లాగే ఉంది మరి. ఇంతకీ మనోడు ముఖ్యమంత్రి అయితే.. ఏంఏం చేస్తాడట.. అంటారా? మేం చెప్పేకన్నా.. వాడినోటితోటే వినండి.

Read more RELATED
Recommended to you

Latest news