మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మకు ముద్దిచ్చాడు.. వీడియో

-

వెర్రి అభిమానం అంటే ఇదే కాబోలు. తన అభిమాన ఆటగాడికి ముద్దు ఇవ్వడం కోసం ఓ వ్యక్తి ఎంతో సాహసం చేశాడు. విజయ్ హజరే ట్రోఫిలో భాగంగా జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ముంబై తరుపున రోహిత్ శర్మ ఆడుతున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంతలోనే ఓ వ్యక్తి బారికేడ్స్ దాటి రోహిత్ వైపుకు దూసుకొచ్చాడు. వెంటనే రోహిత్‌ను కౌగిలించుకొని ముద్దు పెట్టి కాళ్లు మొక్కాడు. ఆ వ్యక్తి వింత ప్రవర్తనకు బిత్తర పోయిన రోహిత్ ఏం జరుగుతున్నదో అర్థం కాక అలాగే నిల్చున్నాడు.

అంతలోనే ఆ ఫ్యాన్ ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ ఇటువంటి అనుభవమే విరాట్ కోహ్లీకి ఎదురైంది. రోహిత్ శర్మకు ముద్దిచ్చినట్టుగానే.. ఓ అభిమాని.. కోహ్లీకి ముద్దు ఇవ్వడానికి ప్రయత్నించాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news