భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన శివలింగం ఇది.. దీని విశిష్టత ఏంటంటే?

-

Kerala now has India’s tallest Shiva lingam

ఇండియాలోనే అత్యంత ఎత్తయిన శివలింగంగా కేరళలోని శివలింగం రికార్డుకెక్కింది. తిరువనంతపురం జిల్లాలోని చెంకల్ లో ఉన్న శ్రీశివపార్వతి గుడిలో ఈ శివలింగం ఉంది. 111.2 అడుగుల ఎత్తు ఉంటుంది ఈ శివలింగం. సిలిండర్ స్ట్రక్షర్ తో ఈ శివలింగాన్ని నిర్మించారు. ఈ శివలింగంలో ఎనిమిది అంతస్తులు ఉంటాయి. అందులో ఆరు.. మనిషి శరీరంలోని చక్రాలు లేదా శక్తి కేంద్రాలను సూచిస్తాయి. ప్రస్తుతానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఈ శివలింగం ఎక్కింది. గిన్నిస్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి కూడా ఈ శివలింగం ఎక్కాలని గుడి నిర్వాహకులు కోరుకుంటున్నారు.

Kerala now has India’s tallest Shiva lingam

ఇక.. ఈ శివలింగం లోపలి నుంచి పైకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి. శివలింగం పైకి ఎక్కితే… హిమాలయాల్లో ఉన్న కైలాసం లాంటి సెట్టింగ్ వేసిన ప్రాంతం కనిపిస్తుందట. ఆ కైలాసంలో శివుడు, పార్వతి విగ్రహాలు ఉన్నాయట. ఈ శివలింగం పైకి ఎక్కితే.. అవి స్పష్టంగా కనిపిస్తాయట. ఈ శివలింగం మొదటి అంతస్తులో 108 శివలింగాలను ప్రతిష్టించారట. శివలింగం పైకి ఎక్కుతుంటే గుహలోకి వెళ్తున్న అనుభూతి కలుగుతుందట. ఈ టెంపుల్ మరో విశిష్టత ఏంటంటే… ఈ గుడిలో శివుడి 12 జ్యోతిర్లింగాలు, వినాయకుడి 32 రూపాలు ఉంటాయట. వాటన్నింటినీ ఒకే చోట దర్శించుకునే గుడి ప్రపంచంలోనే ఎక్కడా లేదట. ఒక్క ఈ గుడిలోనే ఆ భాగ్యం దక్కుతుందట. ఇది కాకుండా… కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న కోటిలింగాల గుడిలో శివలింగం 108 ఫీట్ల ఎత్తు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news