షారుఖ్.. ‘కుచ్ కుచ్ హోతా హై’ సాంగ్‌కు పేరడీ చేసిన ఇండోనేషియన్స్.. వీడియో

-

తాజాగా ఇండోనేషియాకు చెందిన షారుఖ్ ఖాన్ అభిమానులు షారుఖ్ మూవీ కుచ్ కుచ్ హోతా హై టైటిల్ ట్రాక్‌కు పేరడీ వీడియోను రూపొందించారు.

బాలీవుడ్ సినిమా కుచ్ కుచ్ హోతా హై గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఆ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. సినిమాలోని పాటల గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినిమాలకు ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తుంది. ప్రపంచమంతా బాలీవుడ్ సినిమాలకు, స్టార్లకు ఫ్యాన్స్ ఉంటారు.

తాజాగా ఇండోనేషియాకు చెందిన షారుఖ్ ఖాన్ అభిమానులు షారుఖ్ మూవీ కుచ్ కుచ్ హోతా హై టైటిల్ ట్రాక్‌కు పేరడీ వీడియోను రూపొందించారు. అచ్చం ఆ సాంగ్‌లో షారుఖ్, రాణీ ముఖర్జీ, కాజోల్ ఎలా డ్యాన్స్ చేశారో.. వీళ్లు కూడా సేమ్ టు సేమ్ అలాగే డ్యాన్స్ వేసి అదరగొట్టారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news