ఓ కోతి బస్సు నడిపింది. కోతి అంటే అది కోతి కాదు.. కొండెంగ.. కోతి జాతికి చెందిందే కానీ.. దీని తోక పెద్దగా ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లో ఉంటాయి. ఇక.. ఈ కొండెంగ బస్సును నడిపి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కర్ణాటకలోని దేవనాగరెలో ఈ ఘటన చోటు చేసుకున్నది. కేఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సును నడుపుతున్న డ్రైవర్.. బస్సు స్టీరింగ్ మీద కొండెంగను కూర్చోబెట్టుకున్నాడు. అది స్టీరింగ్ తిప్పుతుంటే అతడు దానికి సపోర్ట్ ఇస్తున్నట్లుగా వీడియోలో ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బస్సు డ్రైవర్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది.
#WATCH Viral video from Karnataka's Davanagere of a KSRTC bus driver driving with a Langur perched on the steering wheel. The bus driver has been suspended for endangering the lives of the passengers. pic.twitter.com/RexZAfKZdr
— ANI (@ANI) October 6, 2018