అది గుజరాత్ రాజధాని గాంధీనగర్. అక్కడ ఉన్న సెక్రటేరియెట్‌లో ఓ చిరుత సంచారం ప్రస్తుతం సంచలనమైంది. సోమవారం తెల్లవారుజామున సెక్రటేరియెట్ అంతా కలియతిరిగిన చిరుత పులి ఫుటేజీని గమనించిన సచివాలయం సెక్యూరిటీ సిబ్బంది అవాక్కయ్యారు. చిరుత పులి అసలు సెక్రటేరియెట్ పరిసరాల్లోకి ఎలా వచ్చిందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. అక్కడి నుంచి అది ఎక్కడికి వెళ్లింది.. అసలు.. ఆ టైమ్‌లో చిరుత అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు అటవీశాఖ సిబ్బంది. కానీ.. దాని జాడ మాత్రం ఇంతవరకు తెలియలేదు.
WATCH: Leopard entered Secretariat premises in Gujarat’s Gandhinagar, early morning today. Forest department officials are currently conducting a search operation to locate the feline (Source: CCTV footage) pic.twitter.com/eQYwATbk2b
— ANI (@ANI) November 5, 2018