ఈ యాచకురాలు దగ్గర ఎంత డబ్బుందో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు..!

-

This beggar woman has around 2.34 lakhs in her hand

ఈమె పేరుకే యాచకురాలు. కానీ.. ఈమె దగ్గర ఉన్న డబ్బు ఎంతో తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. సాధారణ వ్యక్తుల వద్ద కూడా అంత డబ్బు చేతుల్లో ఉండదేమో. ఇంతకీ ఆమె దగ్గర ఉన్న డబ్బు ఎంత అంటారా? అక్షరాలా రెండు ల‌క్ష‌ల ముప్పైనాలుగు వేల మూడు వంద‌ల ఇరవై రూపాయ‌లు (రూ.2,34,320). అంత డబ్బున్నా రోజు అడుక్కోవడం మాత్రం మానలేదు ఆమె. రోజూ అడుక్కోవడం.. కొంత డబ్బు దాచుకోవడం.. కొంత ఖర్చు పెట్టుకోవడం.. ఇదే ఆమె జీవన శైలి. కానీ.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నగరంలోని ముసారంబాగ్ వద్ద ఆమె భిక్షాటన చేస్తుండగా చూసి చెర్లపల్లిలోని ఆనందాశ్రమానికి తరలించారు.

అక్కడే ఆమె వస్తువులను చెక్ చేస్తే అంత డబ్బు ఆమె సంచుల్లో నుంచి బయట పడింది. ఇదివరకు తన పేరు మీద ఉన్న ఓ ఇల్లును అమ్మగా వచ్చిన డబ్బులో రెండు లక్షలను తన బంధువులు ఆమెకు ఇచ్చారట. అందులో కొంత తన బంధువులకే ఇచ్చి.. మిగితాది తన దగ్గరే దాచుకుందట ఆమె. అప్పటి నుంచి భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని వెళ్లదీస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భిక్షాటన చేస్తూ 2,34,320 వరకు పోగేసింది. అయితే.. అంత డబ్బు చేతుల్లో పట్టుకొని తిరగడం మంచిది కాదని.. ఆశ్రమం నిర్వాహకులు ఆమెకు చర్లపల్లిలోని ఎస్‌బీఐలో సేవింగ్స్ అకౌంట్ తెరిపించారు. ఆ డబ్బును అందులో జమ చేయించారు. తర్వాత ఆమెకు ఆనందాశ్రమంలోనే ఆశ్రయం కల్పించారు. అదీ సంగ‌తి.

Read more RELATED
Recommended to you

Latest news