కాలింగ్ బెల్ నొక్కాడు.. పాము కరిచింది.. షాకింగ్ వీడియో

-

దీంతో షాక్ కు గురైన ఆ వ్యక్తి.. వెంటనే తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని గట్టిగా అరిచాడు. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని డాక్టర్లు తెలిపారు.

నమ్మలేకపోతున్నారు కదా.. కానీ నమ్మాల్సిన నిజం ఇది. ఓ వ్యక్తి కాలింగ్ బెల్ నొక్కగానే ఓ పాము కాటేసింది. ఈ ఘటన చదువుతుంటే ఇటీవలే ఓ మొసలి ఓ ఇంటి కాలింగ్ బెల్ నొక్కిన ఘటన గుర్తుకొస్తుంది కదా. ఏంటో.. అన్నీ విచిత్రాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో.

ఈ ఘటన యూఎస్ లోని ఓక్లహోమాలో చోటు చేసుకున్నది. జెరల్ హేవుడ్ అనే వ్యక్తి.. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. డోర్ బెల్ కొట్టాడు. అయితే.. అప్పటికే.. ఆ డోర్ మీద ఓ పాము వేలాడుతోంది. ఈ విషయాన్ని హేవుడ్ గమనించలేదు. మనోడు కాలింగ్ బెల్ నొక్కగానే ఆ పాము ఒక్కసారిగా ఆవేశంతో అతడిని కరిచింది. అతడి నుదిటి మీద కాటేసింది.

దీంతో షాక్ కు గురైన ఆ వ్యక్తి.. వెంటనే తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని గట్టిగా అరిచాడు. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని డాక్టర్లు తెలిపారు. అయితే.. ఈ ఘటన ఇంటి ముందు ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను ఆ ఇంటి ఓనర్.. తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేయడంతో.. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news