ఖతర్నాక్ ఖతర్నాక్ కలరు జల్లురా.. దుమ్ములేపుతున్న మంగ్లీ ‘హోలీ’ పాట

సోషల్ మీడియాలో స్టార్లు కావాలంటే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి.. ఏదో వింత చేయాలి.. నెటిజన్లను ఫిదా చేయాలి.. అప్పుడే నెటిజన్లు బ్రహ్మరథం పడతారు..

మంగ్లీ తెలుసు కదా. మైక్ టీవీ వాళ్లు యూట్యూబ్ లో విడుదల చేసే పండుగల పాటలను పాడుతూ స్టార్ అయిపోయింది. ఆమె వాయిస్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రతి పండుగకు ఏదో ఒక పాటతో మంగ్లీ యూట్యూబ్ లో హల్ చల్ చేయాల్సిందే.

Mangli Holi song 2019

తాజాగా ఖతర్నాక్ ఖతర్నాక్ కలరు జల్లురా… ఈ కలరుఫుల్లు హోలిలోన మస్తు థ్రిల్లురా.. అంటూ యూట్యూబ్ లో ఓ పాట పాడింది. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. మంగ్లీ, హన్మంత్ యాదవ్ పాడిన ఈ పాట విడుదలైన మూడు రోజుల్లోనే 12 లక్షల వ్యూస్ ను పొందింది. అంతే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ పాట హల్ చల్ చేస్తోంది. మరి.. మంగ్లీ పాటతో హోలీ వేడుకలను మరింత సంతోషంగా జరుపుకోండి.