వైసీపీలో చేర‌నున్న సినీ న‌టుడు శివాజీ రాజా..? నాగ‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకేనా..?

ప్ర‌ముఖ సినీ నటులు జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌, జ‌య‌సుధ‌, పృథ్వీ, అలీ, త‌నీష్‌, కృష్ణుడు, రాజా ర‌వీంద్రల‌తోపాటు ప‌లువురు నిర్మాత‌లు కూడా ఇప్ప‌టికే వైసీపీలో చేరారు. ఇక త్వ‌ర‌లో మ‌రో ప్ర‌ముఖ న‌టుడు శివాజీ రాజా కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆ రాష్ట్రంలోని ప్రతిప‌క్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్న నాయ‌కుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అందులో భాగంగానే ఇప్ప‌టికే టీడీపీకి చెందిన ప‌లువురు ముఖ్య నేత‌లంతా వైసీపీలో చేరారు. వారిలో కొంద‌రు టిక్కెట్లు సాధించి నామినేష‌న్ వేసేందుకు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్రముఖ న‌టులు కూడా వైసీపీలో చేరేందుకే ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

ప్ర‌ముఖ సినీ నటులు జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌, జ‌య‌సుధ‌, పృథ్వీ, అలీ, త‌నీష్‌, కృష్ణుడు, రాజా ర‌వీంద్రల‌తోపాటు ప‌లువురు నిర్మాత‌లు కూడా ఇప్ప‌టికే వైసీపీలో చేరారు. ఇక త్వ‌ర‌లో మ‌రో ప్ర‌ముఖ న‌టుడు శివాజీ రాజా కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. నేడో రేపో ఆయ‌న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

కాగా శివాజీ రాజా ఇటీవ‌లే జ‌రిగిన మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన విష‌యం విదిత‌మే. దీంతో త‌న ఓట‌మికి గాను నాగ‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని శివాజీ రాజా గ‌తంలో అన్నారు. అయితే వైసీపీలో చేరి నాగ‌బాబుకు వ్య‌తిరేకంగా శివాజీ రాజా ప్ర‌చారం చేస్తార‌ని, దీంతో అదే నాగ‌బాబుకు ఆయ‌న ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ట్ అవుతుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా.. గ‌తంలో క‌న్నా ఇప్పుడు వైసీపీకి సినీ గ్లామ‌ర్ కొంత ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌రి ఆ గ్లామ‌ర్ వైసీపీకి ఎన్ని ఓట్ల‌ను రాబడుతుందో వేచి చూస్తే తెలుస్తుంది..!