చంద్రుడు కుoచించుకుపోతున్నాడ‌ట‌.. నాసా ప‌రిశోధ‌న‌

-

చంద్రుడు రాను రాను కుచించుకుపోతున్నాడ‌ట‌. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే. ద్రాక్ష పండ్ల‌ను ఎండ‌బెట్టినప్పుడు అవి ఎండు ద్రాక్ష‌ల్లా ఎలా ముడుచుకుపోతాయో అలా చంద్రుడు కుచించుకుపోతున్నాడ‌ట‌.

తెలుగు పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం.. చంద్రుడు కూడా ఒక గ్ర‌హమే. కానీ సైన్స్ చెబుతున్న ప్ర‌కారం చంద్రుడు భూమికి ఉపగ్ర‌హం. ఈ క్ర‌మంలోనే చంద్రుడిలో దాగి ఉన్న అనేక ర‌హ‌స్యాల‌ను తెలుసుకునేందుకు ఖ‌గోళ శాస్త్ర‌జ్ఞులు ఎప్ప‌టికప్పుడు ప్ర‌యోగాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో శాటిలైట్ల‌ను పంపి చంద్రుడి గుట్టు తెలుసుకునేందుకు య‌త్నిస్తున్నారు. అయితే అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా తాజాగా చంద్రునికి చెందిన ఓ ర‌హ‌స్యాన్ని తెలియ‌జేసింది. అదేమిటంటే…

చంద్రుడు రాను రాను కుచించుకుపోతున్నాడ‌ట‌. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే. ద్రాక్ష పండ్ల‌ను ఎండ‌బెట్టినప్పుడు అవి ఎండు ద్రాక్ష‌ల్లా ఎలా ముడుచుకుపోతాయో అలా చంద్రుడు కుచించుకుపోతున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే కొన్ని వంద‌ల మిలియ‌న్ల సంవ‌త్స‌రాల కాలంలో చంద్రుడు దాదాపుగా 150 అడుగల క‌న్నా ఎక్కువ‌గానే కుచించుకుపోయాడ‌ట‌. చంద్రునికి సంబంధించిన‌ లూనార్ రీకానిసెన్స్ ఆర్బిటార్ తీసిన 12వేల‌కు పైగా ఉప‌గ్ర‌హ చిత్రాల‌ను ప‌రిశోధ‌కులు క్షుణ్ణంగా ప‌రిశీలించి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

కాగా చంద్రుని అంత‌ర్భాగంలో చ‌ల్ల‌ద‌నం ఏర్ప‌డుతుండ‌డం వ‌ల్లే ఇలా చంద్రుడు కుచించుకుపోతున్నాడ‌ని ఖ‌గోళ శాస్త్ర‌జ్ఞులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్రుని ఉప‌రితలంపై భూమిపై వచ్చే భూకంపాల్లాగే ప్ర‌కంప‌న‌లు కూడా వ‌స్తున్నాయ‌ని వారు చెబుతున్నారు. అలాగే చంద్రుని ఉప‌రితం పెళుసుగా కూడా మారుతుంద‌ని వారు నిర్దారించారు. అయితే భూమి అంత‌ర్భాగంలో ఉన్న‌ట్లు టెక్టోనిక్ ప్లేట్లు చంద్రుని అంత‌ర్భాగంలో లేవ‌ని, ఈ కార‌ణంగా చంద్రుని అంత‌ర్భాగంలో నెమ్మ‌దిగా వేడి త‌గ్గుతూ చ‌ల్ల‌ద‌నం ఆవ‌రిస్తుంద‌ని, దీంతో టెక్టోనిక్ ప్ర‌క్రియ జ‌రుగుతూ చంద్రుడు కుచించుకుపోతున్నాడ‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ఇక చంద్రునిపై ఉన్న ఉత్త‌ర ధ్రువం స‌మీపంలోని మారే ఫ్రిగోరిస్ ప్రాంతం వ‌ద్ద ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయ‌ని, దీంతో అక్క‌డి ప్రాంతం ముందుకు క‌దులుతుంద‌ని కూడా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఏది ఏమైనా.. చంద్రుడు కుచించుకుపోతున్నాడంటే.. అది వింతే క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news