వారంలో 6 రోజుల పాటు.. 6 సార్లు శృంగారంలో పాల్గొనాల‌ట‌.. ఆలీబాబా గ్రూప్ సీఈవో వ్యాఖ్య‌లు..!

వారంలో 6 రోజుల పాటు.. 6 సార్లు శృంగారంలో పాల్గొంటే.. ఆఫీసుల్లో చాలా బాగా ప‌నిచేయ‌గ‌లుగుతార‌ని చెబుతూ కొత్త‌గా 669 అనే సూత్రాన్ని జాక్ మా ప్ర‌తిపాదించారు.

ప్ర‌ముఖ కార్పొరేట్ సంస్థ అలీబాబా గ్రూప్‌ కో ఫౌండ‌ర్‌, సీఈవో జాక్ మా అంటే తెలియ‌ని వారుండ‌రేమో. ఎందుకంటే ఇటీవ‌లి కాలంలో ఆయన ఎక్కువ‌గా వార్త‌ల్లో క‌నిపిస్తున్నారు. అందుకు కార‌ణం ఆయ‌న గ‌తంలో సూత్రీక‌ర‌ణ చేసిన 996 విధాన‌మే. రోజూ ఉద‌యం 9 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు వారానికి 6 రోజుల పాటు ప‌నిచేయాల‌ని జాక్ మా గ‌తంలో చెప్పారు. దీంతో ఆయ‌న‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రోజుకు 8 గంట‌లు ప‌నిచేసే రూల్ ఉంద‌ని, కానీ 12 గంట‌లు ఎలా ప‌నిచేస్తార‌ని, ఇక లైఫ్ అంటే ప‌నిచేయ‌డం ఒక్క‌టేనా.. అని గ‌తంలో చాలా మంది జాక్‌మాను విమ‌ర్శించారు. అయితే ఆ గొడ‌వ ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే జాక్ మా మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా శృంగారం గురించే..!

వారంలో 6 రోజుల పాటు.. 6 సార్లు శృంగారంలో పాల్గొంటే.. ఆఫీసుల్లో చాలా బాగా ప‌నిచేయ‌గ‌లుగుతార‌ని చెబుతూ కొత్త‌గా 669 అనే సూత్రాన్ని జాక్ మా ప్ర‌తిపాదించారు. ఇక్క‌డ 9 అంటే ఎక్కువ స‌మ‌యం అని చైనీయులు మాట్లాడే మాండ‌రిన్ భాష‌లో అర్థం వ‌స్తుంది. అంటే వారంలో 6 రోజుల పాటు 6 సార్లు 9 (ఎక్కువ స‌మ‌యం) పాటు శృంగారం చేయాల‌ని అర్థం. దీని వ‌ల్ల మాన‌సికంగా దృఢంగా ఉంటార‌ని, ప‌నిచేయాలనే కార్య‌ద‌క్ష‌త పెరుగుతుంద‌ని, ఆఫీసుల్లో ఎక్కువ స‌మ‌యం పాటు ప‌నిచేయ‌వ‌చ్చ‌ని జాక్‌మా అన్నారు.

అయితే శృంగారం ప‌ట్ల జాక్‌మా చేసిన పై వ్యాఖ్య‌ల‌ను కూడా చాలా మంది విమ‌ర్శిస్తున్నారు. జాక్‌మా చెప్పిన 996 ప్ర‌కారం రోజుకు 12 గంట‌ల పాటు ప‌నిచేస్తే ఇక ఇంటికి వ‌చ్చి శృంగారంలో ఎలా పాల్గొంటార‌ని జాక్‌మాను విమ‌ర్శిస్తున్నారు. కాగా జాక్‌మా వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు ఖండిస్తుంటే కొంద‌రు మాత్రం ఆ వ్యాఖ్య‌ల‌కు స‌పోర్ట్ ప‌లుకుతుండ‌డం విశేషం. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో కాలం గ‌డిపే ఉద్యోగులు మాన‌సికంగా దృఢంగా ఉండేందుకు శృంగారం ఎంతో దోహ‌ద ప‌డుతుంద‌ని, దాంతో ఆందోళ‌న‌, డిప్రెష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చ‌ని, ఈ క్ర‌మంలో ఉద్యోగం కూడా సాఫీగా చేయ‌వ‌చ్చ‌ని కొంద‌రు అభిప్రాయ ప‌డుతున్నారు. ఏది ఏమైనా.. జాక్‌మా శృంగారం ప‌ట్ల చేసిన ఈ వ్యాఖ్య‌లు కూడా ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి..!