మాజీ ప్రియుడిని చంపి కూరొండి వడ్డించిన యువతి..!

-

Moroccan woman in UAE 'killed lover and cooked him'

యాక్.. అంటారా? ఆమె మనిషా లేక మృగమా అంటారా? కలికాలం బాస్.. ఏం చేస్తాం. రోజులు అలా ఉన్నాయి మరి. మాజీ ప్రియుడి మీద ఎంత కసి ఉండకపోతే ముక్కలుగా నరికి కూరొండుతుంది చెప్పండి. కాస్త వివరంగా చెప్పుకుందాం పదండి..

యూఏఈలోని అజ్మాన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. మొరాకోకు చెందిన ఓ యువతికి, తన ప్రియుడికి పడలేదు. ఇద్దరూ విడిపోయారు. తనను వాడుకొని, డబ్బులు తీసుకొని పట్టించుకోవడం లేదన్న కోపంతో ఆ యువతి ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడిని చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసింది. సేమ్.. చికెన్, మటన్ పీసుల్లా కట్ చేసింది. కమ్మని కూరలా వండింది. అనంతరం తన ఇంటికి సమీపంలో ఓ బిల్డింగ్ నిర్మిస్తున్న కూలీలకు ఆ కూరను వడ్డించింది. మిగిలిన బొక్కలను, మాంసాన్ని కుక్కలను వేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండా చేసింది.. కానీ..

తన సోదరుడు కనిపించడం లేదని ఆ యువతి వద్దకు వెళ్లాడు ఆ వ్యక్తి తమ్ముడు. తనకు తెలియదని ఆ యువతి బొంకపోయింది. తనకు తెలియదని నమ్మబలికింది. కానీ.. ఆ యువతి మీదే అనుమానంతో మృతుడి తమ్ముడు పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు తీగ లాగడంతో అసలు కథ బయటికి వచ్చింది. నిందితురాలి ఇంట్లో ఓ పొడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దానికి పరీక్షలు నిర్వహించగా.. అది మృతుడి డీఎన్‌ఏతో సరితూగింది. దీంతో అసలు విషయం బయటపడింది. అతడిని ఎలా చంపి కూరొండిందో.. పూసగుచ్చినట్టు పోలీసులకు వెల్లడించింది యువతి.

Read more RELATED
Recommended to you

Latest news