వీడియో: విక్టరీ వెంకటేశ్ కు షాకిచ్చిన శ్రీరెడ్డి.. నాకు కార్డు ఇవ్వవా? నేనూ నీ కోడలినే కదా!

ఎవరినో ఒకరిని విమర్శించనిదే శ్రీరెడ్డి నిద్రపోదు కాబోలు. తాజాగా వివాదాలకు దూరంగా ఉండే విక్టరీ వెంకటేశ్ మీద పడింది శ్రీరెడ్డి. ఆయనకు షాకిచ్చింది. ఆయన కూతురు పెళ్లి సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది..

శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. అందరూ తన గురించే మాట్లాడుకోవాలని తను పడే ఆరాటం అందరికీ తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో వాళ్లను తిట్టడం.. వీళ్లను తిట్టడం చేసే శ్రీరెడ్డి తాజాగా విక్టరీ వెంకటేశ్ కు షాకిచ్చింది.

ఏంది వెంకటేశ్ మామ.. నేను అలిగాను. నేను మీ కోడలినే కదా. నాకు పెళ్లి కార్డు ఇవ్వలేదు ఏంటి. ఎంతైన మీ అఫీషియల్ కోడలు కానప్పటికీ.. కోడలునే కదా. నాకు కూడా మీ కూతురు పెళ్లి కార్డు ఇస్తే చాలా సంతోషించేదాన్ని.ఏది ఏమైనా.. మీ పాప హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీ మీద నాకు, మా ఫ్యామిలీకి చాలా అభిమానం.

మీరు ఫ్యామిలీ సబ్జెక్టుల మీద ఎన్నో సినిమాలు తీశారు. మీలాగా ఏ హీరో కూడా ట్రై చేయలేదు. తొందరలోనే మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా విషెష్ మీకు నచ్చినా నచ్చకపోయినా.. ఒక హ్యూమన్ బీయింగ్ గా.. ఒక అభిమానిగా నేను మీకు విషెష్ అందిస్తున్నా.. అంటూ తన యూట్యూబ్ చానెల్ ఈ వీడియోను వదలింది శ్రీరెడ్డి.వామ్మో శ్రీరెడ్డి దగ్గర బాగానే యవ్వారాలు ఉన్నాయిరోయ్.. అంటూ నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.