టాలీవుడ్ హీరోలు గాజులేసుకొని చీరలు కట్టుకోండి.. శ్రీరెడ్డి ఫైర్

ఫేస్ బుక్ లో లైవ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి… యువతిపై జరిగిన దారుణంపై మాట్లాడుతూ.. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఫైర్ అయింది. హైదరాబాద్ లోని ఫిలిం ఇనిస్టిట్యూట్ కు చెందిన ఓ ట్రెయినర్.. నటన నేర్చుకోవడానికి వచ్చిన ఓ యువతిని బట్టలు విప్పాలని అన్నాడని… ఆ ఘటనపై ఒక్క టాలీవుడ్ హీరో కూడా స్పందించలేదని ఫైర్ అయింది.

ఎవరికి సోషల్ మీడియా ఎలా ఉపయోగపడుతుందో తెలియదు కానీ.. శ్రీరెడ్డికి మాత్రం సూపర్బ్ గా ఉపయోగపడుతోంది అని చెప్పుకోవచ్చు. కాస్టింగ్ కౌచ్ పై చాలా రోజుల నుంచి ఆమె నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆమె ఎన్నోసార్లు నోరు విప్పింది.

srireddy fires on tollywood heroes

ఇప్పటికీ.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తను అప్పుడప్పుడూ నోరు విప్పుతూనే ఉంటుంది. కానీ.. సమాజంలో మాత్రం మహిళలపై జరుగుతున్న దాడులు ఆగట్లేవని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవలే కర్ణాటకలో మధు అనే యువతిపై జరిగిన దారుణంపై మాట్లాడింది.

ఫేస్ బుక్ లో లైవ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి… యువతిపై జరిగిన దారుణంపై మాట్లాడుతూ.. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఫైర్ అయింది. హైదరాబాద్ లోని ఫిలిం ఇనిస్టిట్యూట్ కు చెందిన ఓ ట్రెయినర్.. నటన నేర్చుకోవడానికి వచ్చిన ఓ యువతిని బట్టలు విప్పాలని అన్నాడని… ఆ ఘటనపై ఒక్క టాలీవుడ్ హీరో కూడా స్పందించలేదని ఫైర్ అయింది.

టాలీవుడ్ హీరోలంతా గాజులేసుకొని, చీరలు కట్టుకోండి.. అంటూ శ్రీరెడ్డి మండిపడింది. అంతే కాదు.. తను లైవ్ లో మాట్లాడుతుంటే తనపై అసభ్యకర కామెంట్లు పెట్టేవాళ్లపై కూడా బూతు పురాణం అందుకున్నది శ్రీరెడ్డి.

ఇంకా ఆమె ఏం మాట్లాడిందో ఈ వీడియోలో చూడండి…