వీడియో వైరల్: గేదె మీదకెక్కి మరీ ఫోటోలు…ఆఖరికి ఏం అయ్యిందంటే..?

-

సోషల్ మీడియాలో హైలెట్ అవ్వాలి అని చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పైగా ఈ మధ్య కాలంలో ఫోటోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఎవరు కూడా రిస్క్ గురించి పట్టించుకోకుండా సాహసం చేస్తున్నారు. అద్భుతంగా ఫోటోలు రావాలని ఎంతకైనా తెగిస్తున్నారు. ముఖ్యంగా యువత సెల్ఫీలు మోజులో పడిపోయే ఎంతకైనా తెగిస్తున్నారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఎంతో ఫన్నీగా ఉంది ఈ వీడియో అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనేది చూస్తే… ఒక మహిళ ఎలాంటి కారణం లేకుండా సరదాగా ఒక గేదెని వేధించింది. ఆమె వీడియో తీస్తూ అందరినీ నవ్వించాలని అనుకుంది.

గేదె మీదకి ఎక్కి గంతులు వేద్దామనుకున్న ఆమె గేదె మీద ప్రశాంతంగా నిలబడింది. తన చేతులను గేదె పై వేసి ఆట పట్టిస్తుంది తర్వాత గేదె తల పై తన పాదాలను పెడుతుంది. ఇలా ఆమె నవ్వుకుంటూ ఉంటుంది. వెంటనే ఆమె గేదె పై కూర్చోడానికి ప్రయత్నం చేస్తుంది.

గేదె తలని వెనక్కి లాగేసరికి మహిళ గేదె మీద నుంచి కింద పడి పోతుంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా ఈ వీడియోని చూశారు. ఈ వీడియోని నిర్మల వైష్ణవ అనే యూజర్ ఫేస్ బుక్ లో షేర్ చేశారు. చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news