ఎయిర్‌పోర్టుకు బికినీలో వచ్చిన మహిళ.. అందరూ షాక్‌.. వైరల్‌ వీడియో..!

కొన్ని కొన్ని సార్లు కొంత మంది ఏం చేస్తారో అస్సలు తెలియదు. చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు. దీంతో జనాల దృష్టిని వారు ఆకర్షిస్తారు. అలాంటి సందర్భాల్లో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఆ ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

అమెరికాలోని మియామీ ఎయిర్‌పోర్టుకు ఓ మహిళ వచ్చింది. ఆమెను చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఆమె కేవలం బికినీ మాత్రమే ధరించి ఉంది. ఆలివ్‌ గ్రీన్‌ కలర్‌లో ఉన్న బికినీ ధరించి ఆమె ఎయిర్‌పోర్టులో ప్రవేశించింది. అయితే ఫేస్‌ మాస్క్‌ మాత్రం ధరించి ఉంది. దీంతో అందరూ ఆమెను చూసి షాకయ్యారు. అసలు ఆమె ఎందుకు అలా వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు.

కానీ చివరకు తెలిసిందేమిటంటే.. ఆ మహిళ మధ్యాహ్నం ఓ షవర్‌ పార్టీకి వెళ్లిందని, అక్కడ చాలా ఆలస్యం అయిందని, ఫ్లైట్‌ మిస్‌ అవుతానేమోనని చెప్పి ఆమె ఉన్న పళంగా అక్కడి నుంచి వచ్చేసిందని, అందుకనే ఆమె బికినీలో ఉందని వెల్లడైంది.

అయితే ఆమె అలా బికినీలో ఎయిర్‌పోర్టులో తిరుగుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెను అలా చూసి చాలా మంది నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.