దీపావళి రోజున సూర్యగ్రహణం.. ఆ ఒక్కటి చేస్తే చాలా మంచిది..

-

మాములుగా ప్రతి ఏడాది సూర్య,చంద్ర గ్రహణాలు రావడం సహజం..అయితే ఈ ఏడాది దీపావళి పండుగ రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. అయితే ఈ సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించకపోయిన ఈ సూర్యగ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారిపై ఉంటుందని చెప్పాలి. కొన్ని సంవత్సరాల తర్వాత దీపావళి రోజున ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడటం తో గ్రహణ ప్రభావం మనపై ఉండకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి ఇప్పుడు చుద్దాము..

అక్టోబర్ 25వ తేదీన సూర్యగ్రహణం సాయంత్రం 4:22 నుండి 6.30 గంటల వరకు, సూర్యగ్రహణం ప్రాంతాలవారిగా వేరువేరు సమయాలలో ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. అయితే ఈ గ్రహణ సమయంలో ఎవరు ఎలాంటి ఆహార పదార్థాలను భుజించకుండా కేవలం దైవాన్ని ప్రార్థిస్తూ ఉండాలి.అలాగే మనం తాగే నీటిలోనూ చేసుకుని ఆహార పదార్థాల లోనూ కాస్త తులసి ఆకులను గరికపోచులను వేయటం వల్ల గ్రహణ ప్రభావం వాటిపై పడదు. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత కాస్త ఉప్పు నీటితో ఇల్లు మొత్తం శుభ్రం చేసిన వెంటనే స్నానం చేసి దేవత విగ్రహాలను శుభ్రంగా కడిగి పూజ చేయాలి.

ఇక గ్రహణ సమయంలో కొన్ని పనులకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో భార్యాభర్తల శారీరకంగా దూరంగా ఉండాలి అలాగే ఇక గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎలాంటి పరిస్థితులలోను బయటకు రాకూడదు. అదేవిధంగా ధూపం వేయడం హారతులు ఇవ్వడం దీపాలు వెలిగించడం వంటివి కూడా గ్రహణ సమయంలో చేయకూడదు..గ్రహణ సమయంలో ఇలాంటి పనులకు దూరంగా ఉంటే మంచిదని పండితులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news