గ్రీన్ కాకర్స్ అంటే ఏమిటి.. ఎన్నీ రకాలు ?

ఒకప్పుడు వ్యవసాయరంగంలో గ్రీన్ రెవెల్యూషన్ తీసుకొచ్చినట్లు..ఇప్పుడు దీపావళి క్రాకర్స్ లో కూడా గ్రీన్ రెవెల్యూషన్ వచ్చింది. అవే గ్రీన్ కాకర్స్. మనం వాడే క్రాకర్స్ కాలుష్యరహితమైనవి కాదు. సీఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు కాలుష్యరహిత టపాసుల తయారీని పేర్కొన్నారు. అవే మనం ముందు చెప్పుకున్న గ్రీన్ కాకర్స్.

మరికొద్ది రోజుల్లో దీపావళి రాబోతుంది.. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించడానికి చాలా రాష్ట్రాలు బాణసంచా వాడకాన్ని నిషేధించాయి. అయినప్పటికీ, అనేక రాష్ట్రాల ప్రజలు సాధారణ బాణసంచా గ్రీన్ క్రాకర్లను కాల్చడానికి మరియు విక్రయించడానికి కూడా అనుమతిస్తున్నాయి. వీటి గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గ్రీన్ కాకర్స్ అంటే ఏమిటి?

అతి తక్కువ హానికర రసాయనాలతో తయారుచేసే ప్రమాదరహిత బాణాసంచాలను గ్రీన్ కాకర్స్ అంటారు. ఇందులో రసాయన ఫార్ములా వల్ల పేలన తర్వాత నీటి అణువులు ఉత్పత్తి అవుతాయి. ఇది గాల్లో ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, దూళిని గ్రహిస్తుంది. గాల్లో ఉండే నైట్రాక్స్ఫైడ్, సల్ఫర్ ఆక్సైడ్ లను 30-35% తగ్గిస్తుంది. తక్కువ ఉద్గారాలతో ఉత్పత్తితో లైటింగ్, శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి.

ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో సాధారణ బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లను సుప్రీం కోర్టు 2018, అక్టోబర్‌ నెలలో నిషేధించింది. సాధారణ బాణాసంచాను ముందే కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నామని, ఇంత త్వరగా ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ అందుబాటులోకి రావడం కష్టమంటూ ఆరోజు దుకాణదారులు లబోదిబోమంటూ మొత్తుకోగా, సుప్రీం కోర్టు షరతులతో కూడిన మినహాయింపులు ఇచ్చింది. ఈ ఏడాది నుంచి మాత్రం సాధారణ బాణాసంచాను అమ్మరాదని, గ్రీన్‌ కాకర్స్‌ను మాత్రమే అమ్మాలని నిక్కచ్చిగా చెప్పింది.

టపాసుల వాడకాన్ని ఒడిశా ప్రభుత్వం నిషేధించింది.

“సాధారణ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం మరియు అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడం కోసం, ఈ పండుగ నెలలో టపాసుల అమ్మకం, వినియోగం నిషేధించబడాలి” అని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు జారీచేసింది.

ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) జనవరి 1, 2022 వరకు దేశ రాజధానిలో బాణాసంచా అమ్మకాలు మరియు పేల్చడంపై పూర్తిగా నిషేధం విధించింది.

గ్రీన్ క్రాకర్స్ పేల్చడానికి రాజస్థాన్ అనుమతి:

రాష్ట్రంలో క్రాకర్ల అమ్మకం మరియు వినియోగాన్ని నిషేధించాలనే తన నిర్ణయాన్ని రద్దు చేస్తూ, రాజస్థాన్ ప్రభుత్వం ‘గ్రీన్’ క్రాకర్లను మాత్రమే విక్రయించడానికి అనుమతించింది. అంతేకాదు క్రాకర్లు పేల్చడానికి పరిమితం సమయాన్ని మాత్రమే కేటాయించింది.

గ్రీన్‌ క్రాకర్స్‌లో ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారు

సాధారణ క్రాకర్స్‌ అన్నింటిలో ‘బేరియం నైట్రేట్‌’ను ఉపయోగిస్తారు. ఇది అత్యంత హానికరమైన పదార్థం. ప్రజల శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా వాతావరణంలోకి ధూళి, ద్రవ కణాలను వదలని లేదా అణచివేసే పదార్థాలతో గ్రీన్‌ క్రాకర్స్‌ను తయారు చేశారు. ఇందులో ఉపయోగించే పదార్థాల మిశ్రమాన్ని ‘జియోలైట్‌’అంటారట. ఎక్కువ ఆక్సిజన్‌ కలిగిన ఈ పదార్థంతో తయారు చేసే గ్రీన్‌ క్రాకర్స్‌ను కాల్చినప్పుడు అందులోని ఇంధనం వేడి లేదా వెలుతురు రూపంలో బయటకు వెలువడుతుందట. వీటి వల్ల ఎలాంటి విష వాయువులు వెలువడం కనుక సాధారణ క్రాకర్స్‌తో పోలిస్తే 70 శాతం తక్కువ హానికరం ఉంటాయట.

గ్రీన్ కాకర్స్ ఎన్నీ రకాలు ?

ఇప్పుడు తయారు చేస్తోన్న గ్రీన్‌ క్రాకర్స్‌లో ‘సేఫ్‌ వాటర్‌ రిలీజర్, సేఫ్‌ మినిమల్‌ అల్యూమినియం క్రాకర్, సేఫ్‌ థర్మైట్‌ క్రాకర్‌’ రకాలు ఉన్నాయి.

1. సేఫ్‌ వాటర్‌ రిలీజర్‌ క్రాకర్స్‌ను కాల్చినప్పుడు అందులో నుంచి నీరు విడుదలై గాలి, దూళి కణాలు వాతావరణంలో కలువకుండా అడ్డుకుంటుంది.

2. సేఫ్‌ అల్యూమినియం క్రాకర్‌లో అల్యూమినియం అతి తక్కువగా ఉంటుంది.

3. సేఫ్‌ థర్మైట్‌ క్రాకర్‌లో వేడిని ఉత్పత్తి చేసే ఐరన్‌ ఆక్సైడ్‌ లాంటి ఖనిజ లోహాలను, తక్కువ స్థాయిలో అల్యూమినియంను ఉపయోగిస్తారట.

ఇవన్నీ కూడా సాధారణ క్రాకర్స్‌ కన్నా 70 శాతం తక్కువ, అంటే 30 శాతం కాలుష్యాన్ని మాత్రమే విడుదల చేస్తాయి. నూటికి నూరు శాతం కాలుష్యం ఉండొద్దనుకుంటే ఏ క్రాకర్స్‌ను కాల్చకపోవడమే ఉత్తమం.

గ్రీన్‌ క్రాకర్స్‌కు లైసెన్స్‌లు ఎలా?

వీటిని ఉత్పత్తి చేయాలనుకునే వారు ముందుగా ఢిల్లీలోని ‘నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌’ను సంప్రదించి ‘అవగాహన ఒప్పందం’ కుదుర్చుకోవాలి. ఫార్ములాను తీసుకోవాలి. ఆ తర్వాత ‘పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌’ ఆమోదంతో పరిశ్రమ లైసెన్స్‌ తీసుకోవాలి.

రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఈ పరిశ్రమలు ప్రస్తుతం వెలిశాయి. ఈ దీవాళికి దాదాపు అన్ని రాష్ట్రాలు కేవలం కాలుష్యరహిత టపాసులు పేల్చడానికి అనుమతి ఇచ్చాయి. అది కూడా పరిమితటైం వరకే..వెస్ట్ బెంగాళ్ గ్రీన్ కాకర్స్ కాల్చడానికి కూడా రెండు గంటలు మాత్రమే అనుమనతి ఇచ్చింది.

ప్రజల్లో గ్రీన్ క్రాకర్స్ మీద మొదట్లో పెద్దగా అవగాహన ఉండేది కాదు. దాంతో టపాసులు అమ్మకందారులు నార్మల్ క్రాకర్స్ నే గ్రీన్ కాకర్స్ అని అమ్మేవాళ్లు. ప్రస్తుతం రెండు తెలుగురాష్టాల్లో గ్రీన్ క్రాకర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రాకర్స్ ను కాల్చడానికి కూడా రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే అనుమతించింది.