KCR Biopic: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్ఫూర్తిదాయక ప్రముఖులు, గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తులు, మహామహుల జీవితాలకు వెండితెర రూపమిచ్చేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే అనేక నిజ జీవిత కథా చిత్రాలు నిర్మితం అయ్యాయి. ప్రముఖ జీవితాలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఎంత ఉత్సుకత చూపిస్తున్నారో, అదే మాదిరిగా రాజకీయ నాయక, నాయికలు జీవితాలను తెరకెక్కించడంలో ఆసక్తి కనబడుస్తున్నారు.
ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం వడత్యా హరీష్ డైరెక్ట్ తెరకెక్కుతుండగా.. కేసీఆర్ పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులూ దాదాపు అయిపోయాయి. మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేస్తున్నట్టు పోస్టర్ విడుదల చేసారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘చరిత్రను సృష్టించిన ఓ తెలంగాణ ఉద్యమనాయకుడి పాత్రలో నటించడం గర్వంగా ఉందన్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించామన్నారు. సినీ నిర్మాత జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు నిఘంటువు, ఇలాంటి ఉద్యమాన్ని నడిపించిన నాయకుడి జీవితాన్ని తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.