నేటి నుండే నవరాత్రులు మొదలయ్యాయి. చాలా మంది నవరాత్రులు జరుపుకుంటారు. తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజలు చేయడం ఉపవాసాలు చేయడం మొదలైన పద్ధతులను అనుసరిస్తుంటారు. మీరు కూడా నవరాత్రి పూజలు చేస్తున్నట్లయితే వీటిని తప్పకుండా చూడండి. నవరాత్రి పూజలు చేసే వాళ్ళు వీటిని కనుక ఆచరించాలంటే చక్కటి ఫలితాలను పొందవచ్చు. అయితే మరి వాటికోసమే ఇప్పుడు చూద్దాం.
నవరాత్రి పూజ సమయంలో ఇంటి గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు పెడితే మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముఖద్వారం అందంగా ఉండటమే కాకుండా నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి నవరాత్రి సమయంలో మామిడాకులని కడితే మంచిది.
అలానే ఇంటి ముందు పెరట్లో అరటి మొక్కను పెంచితే మంచిది. అరటి చెట్టు లో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. కాబట్టి ఇంట్లో అరటి మొక్కలు పెంచడం కూడా మంచిది.
ఇంటి ముఖద్వారం మీద స్వస్తిక్ గుర్తు ఉంటే మంచిది. ఒకవేళ స్వస్తిక్ గుర్తు తలుపు మీద లేకపోతే పసుపుతో నేరుగానే వేయొచ్చు. ఇది కూడా పూజ సమయంలో ఉంటే మంచిది.
అలానే తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి తులసి మొక్కలో ఉంటుంది కాబట్టి నవరాత్రి సమయంలో పూజ గదిలో పూజ అయిపోయిన తర్వాత తులసి మొక్కను కూడా పూజిస్తే శుభం కలుగుతుంది.
ఇంట్లో ఒక కలశం తీసుకుని దానిలో నీళ్ళు పోయండి. కొన్ని పువ్వులను కూడా పెట్టండి నవరాత్రి అయిపోయిన తర్వాత ఆ నీటిని ఇంట్లో చల్లితే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
అఖండ జ్యోతిని నవరాత్రి పూజ సమయంలో ఉంచితే చాలా మంచిది. మీరు ఇంట్లో పెట్టినప్పుడు కాస్త ఎత్తులో పెట్టండి.
అలానే చాలామంది నవరాత్రి సమయంలో కన్య పూజ చేస్తారు. కన్య పూజ చేస్తే కూడా శుభం కలుగుతుంది కాబట్టి నవరాత్రి సమయంలో వీటిని అనుసరించి ఆనందంగా వుండండి. ఏ సమస్యా లేకుండా వుండండి.