గులాబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్, ఒడిషాలతో పాటు తెలంగాణను కూడా వణికిస్తోంది. తుఫాన్ తీరం దాటడంతో రానున్న రెండు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. వీటి పరిధిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, కాామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీటితో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురనున్నాయి. తెలంగాణకు తీవ్ర వర్షసూచనతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది
తెలంగాణ హైఅలర్ట్… ఉత్తర తెలంగాణకు భారీ వర్షసూచన
-