కోవిషీల్డ్ వ్యాక్సిన్ రేటు 200రూపాయల్లోపే..?

-

కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజల్లో కరోనా భయం తగ్గింది. అంతకుముందు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన వాళ్లందరూ చాలా తొందరగానే వ్యాక్సిన్ వచ్చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మనదేశంలో రెండు కంపెనీల వ్యాక్సిన్లున్నాయి. భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ తో పాటు సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ కూడా అందుబాటులో ఉంది. ఐతే ఈ వ్యాక్సిన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ లభ్యం అవుతున్నాయి.

వాటి ధర వద్దే కొద్దిగా సందేహాలు ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి రాజేష్ భూషణ్ చెప్పిన దాని ప్రకారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ రేటు 200కంటే తక్కువగా ఉంటుందట. ఒక డోసుకి రెండు రూపాయల లోపే వసూలు చేసేలా నిర్ణయం తీసుకోనున్నారట. 157రూపాయలుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియదు. ఇదే నిజమైతే సామాన్య ప్రజలకి మంచి మేలు కలిగినట్లే.

Read more RELATED
Recommended to you

Latest news