మహాశివరాత్రి స్పెషల్.. 5,16,108 రుద్రాక్షలతో శివలింగం.. ఎక్కడంటే..?

-

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులంతా తమ కుటుంబ సభ్యులతో స్వామి దర్శనానికి వచ్చారు. శైవాలయాలు.. వాటి పరిసరాలు ఆ మహదేవుని నామస్మరణతో మార్మోగుతున్నాయి. శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తూ స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా కర్ణాటకలోని మైసూర్​లో వినూత్నంగా శివలింగాన్ని తయారు చేశారు. 5,16,108 రుద్రాక్షలతో 21 అడుగుల శివలింగాన్ని తయారు చేశారు. బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఈ శివలింగ ప్రతిమను ఏర్పాటు చేశారు. శివలింగం చుట్టు కృతిమ కైలాస పర్వతాన్ని కూడా నిర్మించారు. శివరాత్రి సందర్భంగా ప్రతిమను తయారు చేసినట్లు నిర్వహకులు బీకే రంగనాథ్​ తెలిపారు.

​శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులందరికీ అవకాశం కల్పిసున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. ఎవరైతే హిమాలయాలు, కాశీ, కేదారి​నాథ్​ వెళ్లలేకపోతారో వారి కోసమే ఈ శివలింగాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 వరకు ఉచితంగానే భక్తులు దర్శనం చేసుకోవచ్చని రంగనాథ్ తెలిపారు. కాగా 50 మంది కార్మికులు.. వారం రోజుల పాటు శ్రమించి రుద్రాక్ష శివలింగాన్ని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news