కన్నులపండువగా భద్రాద్రి సీతారాముల పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం

-

భద్రాచలం సీతారాముల సన్నిధిలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభంగా కొనసాగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో నిన్న జగదభిరామయ్య కల్యాణం కన్నులపండువగా జరిగింది. ఇవాళ సీతారాములకు పట్టాభిషేకం నిర్వహించారు.

భద్రాద్రిలో ఇవాళ సీతారాముల పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. మిథిలా ప్రాంగణంలో వేద పండితులు.. శాస్త్రోక్తంగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసా సౌందరరాజన్ హాజరయ్యారు. సీతారాములకు గవర్నర్ పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

రామయ్య పట్టాభిషేకాని భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులతో మిథిలా ప్రాంగణం కిటకిటలాడింది. వారందిరకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేసవి కావడంతో సదుపాయాలపై మరింత శ్రద్ధ వహించారు. ప్రతి పుష్కరానికి అంటే పన్నెండేళ్లకోసారి శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్ని, 60 ఏళ్లకోసారి ప్రభవనామ సంవత్సరంలో శ్రీరామ మహా సామ్రాజ్య వైభవ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. 1999లో శ్రీరామునికి ప్రథమ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని, 2011లో రెండో పుష్కర పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతోంది మూడోది.

Read more RELATED
Recommended to you

Latest news