శ్రీరామ నవమి ఎప్పుడు…? రాముల వారి కళ్యాణం శుభ ముహుర్తం, తిథి, పూజ, నైవేద్యం వివరాలు ఇవే..!

-

ఛైత్ర శుద్ధ నవమి నాడు వసంత బుుతువు కాలంలో, పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు దశరథుడు, కౌసల్య దంపతులకు జన్మించారు. ఆయన జనించడం వలన ఆ రోజు ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామ నవమి వేడుకలను చేస్తూ ఉంటాము. శ్రీరామ నవమి నాడు రాముడిని ఆరాధిస్తారు. ఇళ్లల్లో, దేవాలయాల్లో కూడా రాముడు కి ప్రత్యేక పూజలు చేస్తారు.

హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతారు. ఇక ఈసారి శ్రీరామ నవమి ఎప్పుడు వచ్చింది అనే విషయాలని చూద్దాం. ఏ దేవుడికి అయినా పూజలను సూర్యోదయం అయ్యాక మొదలు పెడతారు. కానీ సీతారాముల కళ్యాణం ని కానీ రాముడికి పూజ కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేస్తారు. శ్రీ సీతారాముల విగ్రహాలతో పాటుగా లక్ష్మణుడు, ఆంజనేయునికి కూడా పూజలు చేస్తుంటారు. పూల హారాలతో విగ్రహాలను అలంకరించాలి.

ఈసారి శ్రీ రామ నవమి ఎప్పుడు వచ్చిందంటే..?

ఛైత్ర మాసంలో శ్రీరామ నవమి తిథి 29 మార్చి 2023 రాత్రి 9:07 గంటలకు మొదలు కానుంది.
30 మార్చి 2023 గురువారం నాడు రాత్రి 11:30 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం మార్చి 30వ తేదీన ఉదయం 11:17 గంటల నుంచి మధ్యాహ్నం 1:46 గంటల మధ్యన రాముడి కి పూజలు చేయాలి.

శ్రీ రామ నవమి పూజ, నైవేద్యం:

శ్రీ రామ నవమి నాడు మామిడి ఆకులు, కొబ్బరికాయను కలశంపై ఉంచాలి. అలానే ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా మాములే. తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు వడపప్పు, పానకం, పండ్లు, ఏదైనా స్వీటు వంటివి నైవేద్యం పెడతారు. విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇస్తే మంచిది. ఈరోజు చాలా మంది సామర్థ్యం మేరకు అన్నదానం కూడా చేస్తూ వుంటారు.

లోకాభిరామం రణ రంగ ధీరం రాజీవ నేత్రం రఘు వమ్ష నాదం|
కరుణ్య రూపం కరుణాకరంథం శ్రీ రామ చంద్రం షరణం ప్రభర్థ్యే||

Read more RELATED
Recommended to you

Latest news