మండు వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా ఆమ్ ప‌న్నా డ్రింక్ తాగుదామా..!

-

వేస‌వి కాలంలో మ‌న‌కు మామిడికాయ‌లు విరివిగా ల‌భిస్తాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఏడాదిలో కేవ‌లం ఒక సీజ‌న్‌లో మాత్ర‌మే ఈ పండ్లు మ‌న‌కు ల‌భిస్తాయి. దీంతో ఈ పండ్ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుంటారు. అయితే బాగా పండిన మామిడి పండ్ల‌ను చాలా మందే తింటారు. కానీ ప‌చ్చిమామిడి కాయ‌ల‌ను తినేందుకు అంత‌గా ఎవ‌రూ ఆస‌క్తి చూప‌రు. అయితే నిజానికి ప‌చ్చిమామిడి పండ్లు కూడా మ‌న‌కు మేలే చేస్తాయి. అయితే వాటిని నేరుగా తిన‌లేమ‌ని అనుకునే వారు ఆమ్ ప‌న్నా అనే డ్రింక్ త‌యారు చేసుకుని వాటిని జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. మ‌రి ఆమ్ ప‌న్నా ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఆమ్ ప‌న్నా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

ప‌చ్చి మామిడికాయ‌లు – 500 గ్రాములు
చ‌క్కెర – అర క‌ప్పు
ఉప్పు – 2 టీస్పూన్లు
న‌ల్ల ఉప్పు – 2 టీస్పూన్లు
వేయించిన జీల‌క‌ర్ర పొడి – 2 టీస్పూన్లు
పుదీనా ఆకులు – 2 టేబుల్ స్పూన్లు (క‌ట్ చేసిన‌వి)
నీరు – 2 క‌ప్పులు

ఆమ్ ప‌న్నా త‌యారు చేసే విధానం…

మామిడికాయ ముక్క‌ల‌ను బాగా ఉడ‌క‌బెట్టాలి. లోప‌లి కండ భాగం మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వాటిని ఉడికించాలి. అనంత‌రం వాటి నుంచి గుజ్జు తీసి తొక్క‌ల‌ను ప‌డేయాలి. ఆ గుజ్జులో పైన చెప్పిన అన్ని ప‌దార్థాల‌ను క‌లిపి బాగా మిక్సీ ప‌ట్టాలి. దానికి 2 క‌ప్పుల నీరు జోడించాలి. దీంతో ఆమ్ ప‌న్నా త‌యార‌వుతుంది. అనంతరం గ్లాసులో ఐస్ ముక్క‌లు వేసి వాటిపై ఆమ్ ప‌న్నా పోసి స‌ర్వ్ చేయాలి..!

Read more RELATED
Recommended to you

Latest news