మ‌ద్యం సేవించారా.. ఏం ఫ‌ర్లేదు.. ప‌చ్చిమిర్చి తినండి.. లివ‌ర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది..!

-

మ‌ద్యం సేవించిన‌ప్పుడు సింపుల్‌గా ప‌చ్చిమిర్చి తినేయండి. దీంతో మీ లివ‌ర్ డ్యామేజ్ అవ‌కుండా ఉంటుంది. ఏంటీ.. న‌మ్మ‌డం లేదా.. అయినా ఇది నిజమండీ బాబూ.. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లోనే ఈ విష‌యం తేలింది.

మద్యం సేవిస్తే లివ‌ర్ పాడవుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే మ‌ద్యపానం వల్ల మ‌న‌కు ఇంకా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. దీంతో మ‌ద్యం సేవించ‌కూడ‌ద‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. అయిన‌ప్ప‌టికీ మ‌ద్యం ప్రియులు ఆ మాట‌ల‌ను ప‌ట్టించుకోకుండా పెగ్గు మీద పెగ్గు లాగించేస్తుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం ఏమిటంటే.. మ‌ద్యం సేవించినా లివ‌ర్ పాడ‌వ‌కుండా ఉండేందుకు ఏం చేయాలి ? అని.. అందుకు మార్గం.. ప‌చ్చిమిర్చి.. అవును, మీరు విన్న‌ది నిజ‌మే..!

మ‌ద్యం సేవించిన‌ప్పుడు సింపుల్‌గా ప‌చ్చిమిర్చి తినేయండి. దీంతో మీ లివ‌ర్ డ్యామేజ్ అవ‌కుండా ఉంటుంది. ఏంటీ.. న‌మ్మ‌డం లేదా.. అయినా ఇది నిజమండీ బాబూ.. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లోనే ఈ విష‌యం తేలింది. ఆఫ్రికాలోని ఓ జాతికి చెందిన ప్ర‌జ‌లు మ‌ద్యం సేవించేట‌ప్పుడు ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను బాగా తింటార‌ట‌. దీంతో వారి లివ‌ర్ డ్యామేజ్ అవ‌డం లేద‌ని సైంటిస్టులు తేల్చారు. ప‌చ్చిమిర‌ప కాయ‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్‌ను నాశ‌నం కాకుండా చూస్తాయ‌ట‌. అందుక‌నే మ‌ద్యం సేవించిన‌ప్పుడు ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను తింటే లివ‌ర్ పాడుకాకుండా ఉంటుంద‌ని వారు అంటున్నారు.

క‌నుక సైంటిస్టులు చెబుతున్న‌దేమిటంటే.. మ‌ద్యం సేవించేట‌ప్పుడు లివ‌ర్‌పై ఆ ప్రభావం ప‌డ‌కుండా ఉండాలంటే.. ప‌చ్చిమిర‌ప కాయ‌ల‌ను తినాల‌ని అంటున్నారు. ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌ద్యం సేవించిన‌ప్ప‌టికీ దాని ప్ర‌భావం లివ‌ర్‌పై ఉండ‌ద‌ని, లివ‌ర్ ఆరోగ్యంగానే ఉంటుంద‌ని సైంటిస్టులు తేల్చారు. అయితే ప‌చ్చి మిర‌ప కాయ‌లు లివ‌ర్‌కు మేలు చేస్తాయ‌ని చెప్పి అదే ప‌నిగా వాటిని తిన‌కూడ‌ద‌ని, లేదంటే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవకాశం ఉంటుంద‌ని, క‌నుక వాటినైనా ఎంత మోతాదులో అవ‌స‌ర‌మో.. అంతే మోతాదులో తినాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news