దోసకాయ, టమాటా కలిపి వండేస్తున్నారా.. ఈ కాంబినేషన్‌ డేంజరట

-

వంటల్లో బాగా వాడే కూరగాయ ఏంట్రా అంటే.. టమాటా.. ఇది ఎందులో పడితే అందులో కలిపేసి..వంట చేసేస్తాం.. కూరగాయల రేట్లు ఎలా ఉన్నా.. ఒక టమాటా రేటు పెరిగిందంటే.. ఆడవాళ్లకు గుబులే.. టమాటతో కామన్‌గా చేసే వంటల్లో దోసకాయ టమాటా కూడా ఒకటి.. చాలామందికి ఈ కాంబినేషన్‌ అంటే ఇష్టం కదా..! కానీ దోసకాయ, టమాటా కాంబినేష్‌ యమ డేంజరట.. ఇలా తినొద్దు అని నిపుణులు అంటున్నారు.

ఎండాకాలంలో దోసకాయలు తినడం చాలా మంచిదని మనందరికీ తెలుసు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఈ దోసకాయలను సలాడ్లు చేసుకుంటాం, వంటకాల్లో వేసుకుంటాం, పచ్చిగా కూడా తినవచ్చు. తద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ దోసకాయలను కొన్నింటితో కలిసి అస్సలు తినకూడదు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాల కలయిక మేలు కంటే కూడా హానికరం కావచ్చు. ఉదాహరణకు చేపలు పెరుగు కలిపి తినరు, అలాగే పాలకూర టొమాటో కూడా కలిపి తినొద్దంటారు. ఇదే రకంగా దోసకాయలతో కూడా కలపకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

దోసకాయ, టొమాటో కలిపి ఎందుకు తినకూడదు

దోసకాయ, టొమాటోలను చాలా వంటకాల్లో వినియోగిస్తారు. కొంతమంది ఈ రెండింటినీ సలాడ్‌లలో కలిపి తింటారు. కానీ ఆరోగ్య పరంగా ఇది సరైన ఫుడ్ కాంబినేషన్ కాదట.. వాస్తవానికి, ఈ రెండు జీర్ణమయ్యే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ రెండింటి కలయిక జీర్ణక్రియ సమయంలో ఆసిడ్ pHని అసమతుల్యంగా చేస్తుందట..దీనివల్ల కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం మొదలైన జీర్ణ సమస్యలు వస్తాయి.

దోసకాయ, ముల్లంగి కలయిక

టమోటాను కలిపేసినట్లే దోసకాయ, ముల్లంగిని కూడా సలాడ్‌లో కలిపి తింటారు.. అయితే, ఇది కూడా విరుద్ధమైన ఆహార కలయిక. దోసకాయ అలాగే ముల్లంగిలోని పోషకాలు రసాయన చర్య జరిపే అవకాశం ఉంటుంది. దోసకాయలో ఆస్కార్బేట్ ఉంటుంది, ఇది విటమిన్ సిని గ్రహించేలా చేస్తుంది. ముల్లంగిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దోసకాయ ముల్లంగిని కలిపి తింటే, అది ఈ ప్రక్రియలో ప్రతిస్పంద్రక చర్యను సృష్టిస్తుంది. దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు.

దోసకాయ, పాలు కలయిక

కొన్ని కూరల్లో చివర్లో పాలు పోయడం చాలా మందికి అలవాటు. అలా పోసి వండిని మస్త్‌ టేస్ట్‌గా ఉంటాయి.. ఉదాహరణకు.. బీరకాయ, పొట్లకాయ.. వీటిల్లో పాలు పోస్తారు.. అలానే దోసకాయలో కూడా పాలు పోస్తే.. చాలా ప్రమాదం. దోసకాయ, పాలు రెండూ వేటికవే తమదైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే పోషకాహారాలు. చాలా మంది పాలు లేదా పాల పదార్థాలతో అనేక రకాలైన పండ్లు, కూరగాయలు కలుపుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నామని భావిస్తారు. కానీ ఇది అన్ని సందర్భాలలో కాదు. దోసకాయలను పాలు లేదా పాల పదార్థాలతో కలిపి తినకూడదు. పాలు భేదిమందులా పనిచేస్తాయి, దోసకాయలు మూత్ర విసర్జక కారకం. ఈ రెండూ కలిపితే వాంతులు, విరేచనాలే. పేగు కదలికలు ఎక్కువగా ఉండవచ్చు, జీర్ణక్రియ ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు.

కాబట్టి.. దోసకాయతో కాంబినేషన్‌ వంట చేసేప్పుడు జర పైలం.. మీకు ముందు నుంచే జీర్ణక్రియ సమస్యలు ఉంటే ఇలా తినొద్దు..ఏది తిన్నా గ్రహించుకోగల శక్తి మీకు ఉంటే తిన్నా పెద్దగా సమస్య ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news