కరివేపాకు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..

-

కరివేపాకు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ ఏ, బీ, సీ, పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి ఎముకలకి బలం చేకూరుతుంది. ఇంకా బరువు తగ్గడానికి కరివేపాకు చేసే మేలు అంతా ఇంతా కాదు. చిన్నపిల్లలు కూరలో కరివేపాకుని పక్కన పెడుతుంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలని చెప్పండి. కూరల్లో వేస్తున్నారంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్థం చేసుకోవాలి.

బరువు తగ్గడం

ఇందులో కార్బజోల్ ఆల్కలైడ్ల వల్ల బరువు తగ్గుతారు. ఐతే ఎండిపోయిన కరివేపాకులని తినడం మంచిది. లేదా కరివేపాకు పొడి అయిన ఫర్వాలేదు.

మలబద్దకం, డయేరియా

ఎండిన కరివేపాకుని మిక్సర్ లో వేసి పొడిగా చేసి, ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే మంచి ఉపశమనం ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు తొలగిపోయి మలబద్దకం దూరమవుతుంది.

పొద్దున్న పూట అలసట

గర్భిణీలకి పొద్దున్న పూట కలిగే అలసటని పోగొట్టడానికి కరివేపాకు చాలా మేలు చేస్తుంది.

బాక్టీరియాని బయటకి పంపేస్తుంది

మన శరీరానికి వచ్చే చాలా సమస్యలు బాక్టీరియా కారణంగానే వస్తుంటాయి. కరివేపాకుని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బాక్టీరియా దూరం అవుతుంది. అందులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ బాక్టీరియాని దూరం చేయడంలో సాయపడతాయి.

కంటిచూపు

విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కంటిచూపు తొందరగా మందగించకుండా ఉంటుంది. కాటరాక్ట్ పాడవకుండా ఇందులో ఉండే విటమిన్ ఏ కాపాడుతుంది. కరివేపాకు తింటే కంటిచూపు బాగుపడుతుందని చాలా మందికి తెలుసు.

అందుకే ఇన్ని లాభాలున్న కరివేపాకు కూరలోంచి బయటకి పారేయకుండా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news