కడుపు సమస్యల నుండి కలరా వరకు పుదీనా చేసే ప్రయోజనాలు..

వంటింట్లో విరివిగా వాడే పుదీనా వల్ల చాలా మంచి ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి ఇది బాగా పని చేస్తుంది. ఇందులో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. వేసవి కాలంలో దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది. వేడిని తగ్గించి చల్లదన్నాన్ని అందిస్తుంది కాబట్టి పుదీనాని పచ్చడి రూపంలో కానీ, మరో రకంగా గానీ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్-ఎ, రిబోఫ్లేవిన్, ఇనుము, కొవ్వు ఇంకా రాగి వంటి పోషకాలు ఉన్నాయి.

పుదీనాని తీసుకోవడం ద్వారా దూరమయ్యే సమస్యలు

కడుపు సమస్య

కడుపు సమస్యలతో బాధపడుతుంటే పుదీనాని తీసుకుని దాన్ని రసంగా చేసి, దానికి ఒక టీ స్పూన్ తేనె కలుపుని గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి తాగాలి. ఇంకా కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు ఉన్నట్లయితే, పుదీనాను ఉడకబెట్టి కొద్దిగా తేనె వేసి తినవచ్చు.

వాంతులు తగ్గుతాయి.

పుదీనాకి తేనె కలిపి తీసుకుంటే వాంతులు తగ్గిపోతాయి. వాంతులు రావడం కడుపు సమస్యకి కారణం. దీన్ని దూరం ఉంచడానికి పుదీనా బాగా ఉపయోగపడుతుంది.

దగ్గు, జ్వరం తగ్గిస్తుంది.

పుదీనా రసంతో చేసిన టీ జలుబు దగ్గుని తగ్గిస్తుంది. పుదీనా ఆకులని బాగా దంచి దాని పేస్టుని నుదుటి మీద వర్తించడం ద్వారా తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

కలరా

కలరా వ్యాధితో ఇబంది పడుతుంటే పుదీనా రసం బాగా పనిచేస్తుంది. దీనితో పాటు నిమ్మరసం, ఉల్లిపాయ రసం రాక్ సాల్ట్ తినవచ్చు.

ఉబ్బసం

పుదీనాలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉబ్బసాన్ని తగ్గించడంలో సాయపడతాయి.