చికెన్ గారెలు – వేడి వేడి స్నాక్స్‌

-

చినుకు తాకే జడిలో.. చెలిమి చిగురు తొడుగడమేమో కానీ.. వేడి వేడి స్నాక్స్‌ నోట్లో వేసుకుంటే.. అబ్బా ఆ మజాయే వేరు.. చికెన్‌ జీడిపప్పు గారెలు చేయడం నేర్చుకుందాం..
Chicken Cashew recipe

కావాల్సినవి

:
చికెన్ : 200 గ్రా. (బోన్‌లెస్)
జీడిపప్పు : 100 గ్రా.
శనగపిండి: 200 గ్రా.,
బియ్యం పిండి : 50 గ్రా.,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
కారం : 2 టేబుల్‌స్పూన్స్
పసుపు : పావు టీస్పూన్
పుదీనా : చిన్న కట్ట,
కొత్తిమీర : అరకట్ట,
ఉప్పు, నూనె : తగినంత

చికెన్ జీడిపప్పు గారెలు తయారీ

:
చికెన్‌ను బాగా కడుగాలి. ఆ తర్వాత కీమాలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. జీడిపప్పును పేస్ట్‌లా చేసుకోవాలి. చికెన్ కీమాలో జీడిపప్పు పేస్ట్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, శనగపిండి, బియ్యం పిండి కొంచెం నీరు పోసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టాలి. ఈ లోపు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. చికెన్ మిశ్రమాన్ని చిన్న వడల్లా చేసి నూనెలో వేయించుకోవాలి. వీటిని అలాగే తినేయొచ్చు. లేదా ఏదైనా చట్నీతో తిన్నా టేస్టీగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news