చాలా మందికి ఉన్న అనుమానం… వర్కవుట్‌కు ముందు, తర్వాత ఏం తినాలి? వ్యాయామం చేయడానికి సరైన శక్తి అనేది చాలా అవసరం. చేసిన తర్వాత కూడా శక్తి అవసరం. కాబట్టి మంచి స్నాక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఈ వ్యాయామాలు చేసే వారు ఈ స్నాక్స్ తింటే చాలా మంచిది అంటున్నారు. అవి ఏంటో చూడండి.
కార్డియో: ఈ వ్యాయామాలు చేస్తుంటే… అరగంట ముందు ఒక పెద్ద సైజు పియర్స్‌ను ఒకటిన్నర టీస్పూన్ల తేనెతో కలిపి తింటే గనుక… దాదాపు 150 కేలరీల శక్తి మీకు అందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చేసిన తర్వాత తర్వాత 3/4 కప్పుల చాక్లెట్ మిల్క్ తాగడంతో పాటుగా ఒక చిన్న అరటి పండు తీసుకుంటే అలసిన కండరాలకు సరైన ప్రోటీన్ దొరుకుతుంది.
హిట్ క్లాసెస్: సర్క్యూట్/ఇంటర్వెల్ వ్యాయామాలు చేసే వారు… ప్రొటీన్లు, ఫ్యాట్స్ ఏమాత్రం లేని రెండు స్లైసుల బ్రౌన్ బ్రెడ్, పళ్లతో తయారైన జామ్‌తో కలిపి తింటే 160 కేలరీల శక్తి మీకు అందుతుంది. చేసిన తర్వాత తర్వాత కొవ్వులు, ప్రొటీన్‌తో పాటు 171 కేలరీలు సరిపడా ఉండే రెండు టేబుల్ స్పూన్ల అవకాడో, 3 టేబుల్ స్పూన్ల ష్రెడెడ్ చీజ్ తినాలి.
వెయిట్ ట్రైనింగ్: ఒక కప్పు ఉడికించిన పచ్చి బఠాణీ, చిక్కుళ్లు తింటే 190 కేలరీలు మీకు లభిస్తాయి. నాన్‌ఫ్యాట్ యోగర్ట్, పావు కప్పు స్ర్టాబెర్రీలు తినాలి. దీన్లో ఉండే 26 గ్రాముల ప్రొటీన్ వెయిట్ ట్రైనింగ్‌తో అలసిన కండరాలకు మంచి శక్తి లభిస్తుంది.