లైంగిక సమస్యలకు అల్లం నెంబర్‌ వన్‌ సొల్యూషన్‌..!!

-

మన పూర్వీకులు వంటిల్లే వైద్యశాలగా వాడుకున్నారు. ఎవరి ఇంట్లో అయినా అల్లం కచ్చితంగా ఉంటుంది. అల్లం వంటల్లోనే కాదు.. ఎన్నో సమస్యలకు పరిష్కారంగా కూడా వాడుకోవచ్చు.. ఇందులో ఉన్న ఔషదగుణాలు బోలెడు..అల్లానికి లైంగిక ప్రేరేపణ, లిబిడోను పెంచడానికి సహజ ఉద్దీపనగా వాడుకోవచ్చు.. ఈరోజుల్లో లైంగిక సమస్యలకు చాలా మంది చికిత్స చేయించుకుంటున్నారు. ఒక మనిషికి ఆహారం ఎంత ముఖ్యమే.. లైంగిక సుఖం కూడా అంతే ముఖం.. చెప్పడానికి సిగ్గుపడతారు కానీ..లైంగిక సంబంధం మంచిగా ఉంటే.. ఆ వ్యక్తి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు.. లేదంటే.. చికాకు, ఒత్తిడి, మానసిక ఆందోళన..మీ పార్ట్‌నర్‌కు లైంగిక వాంఛ తక్కువగా ఉండటం, అస్సలు ఇష్టం లేకపోతే.. మీరు హ్యాపీగా ఉండగలరా..? అల్లం ఒక మంచి సెక్స్‌ డ్రైవ్ తెలుసా..!

ఆక్సీకరణ ఒత్తిడితో సంతానోత్పత్తి, లైంగిక పనితీరకు అల్లం ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఎన్నో అధ్యయనాల ద్వారా తేలింది. అల్లం(Ginger) శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే సామర్థ్యం ఉంది. అల్లం పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచుతుందని కొన్ని ఆధారాల ద్వారా నిరూపితమైంది. స్పెర్మ్(Sperm) కణాల ఏకాగ్రత, చలనశీలత, సాధ్యతను మెరుగుపరచడం ద్వారా వీర్యం నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.. అల్లం రక్త ప్రవాహాన్ని పెంచుతుందని తేలింది. ఇది లైంగిక ప్రేరేపణ, లిబిడో(Libido)ను మెరుగుపరచడానికి దారితీయవచ్చు. అల్లం రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుందని, రక్త నాళాల విస్తరణ ద్వారా మెరుగైన రక్త ప్రవాహానికి తోడ్పడుతుంది. ఇది ఉద్రేకాన్ని పెంచుతుంది. అల్లం అంగస్తంభనకు ఒక ప్రసిద్ధ చికిత్స.

అల్లం అవయవాలు, కణజాలాల నుంచి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది అంగస్తంభనకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే అల్లం మగ లిబిడో కోసం అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, అల్లం లూటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడం, వృషణాలలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం ద్వారా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుందని అనేక అధ్యయనాల ద్వారా తేలింది. ఇది మెరుగైన మగ లిబిడోకు ప్రయోజనకరంగా ఉంటుంది.

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు బాగా ఉన్నాయి. ఇవి పురుషుల కీళ్ళు, మెదడు, లిబిడోకు ప్రయోజనకరంగా ఉందని తేలింది. మీరు మీ ఆహారంలో, వేడి అల్లం టీ రూపంలో, సాస్‌లు, డెజర్ట్‌లలో అల్లాన్ని జోడించొచ్చు. మీ ఆహారంలో అల్లం తీసుకోవడం ద్వారా మీ సెక్స్ డ్రైవ్‌ను పెంచుకోవచ్చు.

అతిగా వద్దు..

అల్లాన్ని అధికంగా వినియోగిస్తే.. గుండెల్లో మంట, విరేచనాలు, కడుపు నొప్పి, సాధారణ కడుపు అసౌకర్యం వంటి తేలికపాటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకోకూడదు. రోజూ ఉదయాన్ని చిన్న అల్లం ముక్కను తేనె లేదా నెయ్యిలో నంచుకుని తింటే సరి.. బోలెడు లాభాలు..!

Read more RELATED
Recommended to you

Latest news