వంటింటి పదార్థాలతో కొవ్వ్వును కరిగించే వాటిని తెలుసుకోండి..

-

కరోనా కారణంగా ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేస్తుండడంతో బరువు పెరుగుతున్నారు. ఒకేచోట కూర్చునే పనులు చేయడం వల్ల కొవ్వు చాలా తొందరగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం చేస్తున్న వారందరూ ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. కొవ్వు ఎక్కువగా పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల కొవ్వు పెరగకుండా ఉండడానికి, పెరిగిన కొవ్వును తగ్గించడానికి ఏయే ఆహారపదార్థాలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

గ్రీన్ టీ

సాధారణంగా పొద్దున్న లేవగానే ప్రతీ ఒక్కరూ టీ, కాఫీల గురించి వెతుకుతుంటారు. ఐతే ఇకపై వాటిని మానేయండి. శుభ్రంగా డైలీ గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ లో ఉండే ఫాలీఫెనాల్స్ సమ్మేళనాలు కొవ్వుని నియంత్రించడంలో బాగా సాయపడుతుంది. పొద్దుట పూట అయినా సాయంత్రమైనా ఒకసారి గ్రీన్ టీ అలవాటు చేసుకోండి.

మెంతులు..

మెంతుల్లో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది. వంటింట్లో చాలా విరివిగా ఉపయోగించే మెంతులు కొవ్వుని చాలా వేగంగా తగ్గిస్తాయి. రోజూ ఒక అరస్పూను మెంతులు తీసుకుంటే చాలా బాగుంటుంది.

ధన్యాలు..

కొత్తి మీర కట్ట అని తేలిగ్గా తీసి పారేసే దానిలో మనకి కావాల్సిన ఎన్నో ఉపయోగాలున్నాయి. కొత్తిమీర విత్తనాలయిన ధన్యాలలో ఉండే ఫోలిక్ ఆమ్లం శరీరానికి చాలా అవసరం. ఇందులో విటమిన్ ఏ, బీ తో పాటు విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. ధన్యాలని ఆహారంలో భాగం చేసుకుంటే కొవ్వు కరిగించడంలో చాలా సాయం చేస్తుంది.

వెల్లుల్లి..

వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలోని కొవ్వుని బాగా కరిగిస్తుంది. సాధారణంగా వెల్లుల్లి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. దీన్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. రోజూ కొంచెం వెల్లుల్లిని తీసుకుంటే శరీరంలో కొవ్వు మాయమైపోతుంది.

ఐతే ఏది తీసుకున్నా అతిగా తీసుకోకూడదనే విషయం గుర్తుంచుకోవాలి. ఎవరో అన్నట్టు మితంగా తింటే ఆహారం, అతిగా తింటే విషం అన్నది గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news