చర్మం పొడిబారుతుందా? తేమగా ఉంచుకోవడానికి కావాల్సిన ఆహార పదార్థాలివే..

-

మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. చర్మం అనగానే చాలా మంది అందం మాత్రమే అనుకుంటారు. చర్మ సంరక్షణ అంటే అందంగా కనిపించడమే అనుకుంటారు. కానీ చర్మం సురక్షితంగా లేకపోతే అనేక ఇతర ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉండాలి. చర్మం పొడిబారుతుంటే అనేక సూక్ష్మజీవులు చర్మంలోకి వెళ్ళి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి ఇబ్బందులని దూరం చేసుకుని, చర్మాన్ని ఆరోగ్యంగా తేమగా ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.

ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి మేలు చేస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా అవసరం.

గింజలు:

గింజల్లో చర్మానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల చర్మం తేమగా ఉంటుంది.

అవోకోడో:

ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉండే అవోకోడో ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే బాగుంటుంది. బ్రేడ్ తో పాటుగానీ లేదా నార్మల్ గా గానీ దీన్ని తినవచ్చు. పోషకాలతో పాటు విటమిన్లు కూడా అధిక పాళ్లలో ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారకుండా చేస్తాయి.

కొవ్వు పట్టిన చేపలు

మన శరీరంలో తయారవని ఒమెగా ప్ కొవ్వు ఈ చేపల్లో ఉంటుంది. చర్మ కణాలకు ఈ చేపలు చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వారంలో మూడు సార్లయినా కొవ్వు పట్టిన చేపలని ఆహారంలో భాగం చేసుకుంటే బాగుంటుంది.

కొబ్బరినూనె

చర్మంపై మర్దన చేసుకోవడానికి కొబ్బరి నూనె కి మించినది లేదని చెప్పవచ్చు. కొబ్బరి నూనెని ఆహారంలో భాగం చేసుకోవడం అంత మంచిది కాకపోయినప్పటికీ చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం తేమగా మారి ఆరోగ్యంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news